మేమంటే అంత చులకనా!: ఇలాంటి చీరతో బతుకమ్మ ఆడగలవా?.. కవితకు షాక్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బతుకమ్మ చీరలతో తెలంగాణ ఆడపడుచులకు మరింత దగ్గరవాలని చూసిన ఎంపీ కవిత ప్లాన్ బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. పేరుకేమో గద్వాల చీరల పంపిణీ అని చెప్పి.. రూ.100 విలువ చేసే చీరలను అంటగడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మీరిచ్చే రూ.100 చీర కోసం.. రూ.300 రోజు కూలీ వదులుకుని మేము రావాలా? అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. టీవీల్లో, పేపర్లలో మాత్రం గద్వాల చీరలంటూ ఊదరగొట్టి.. తీరా ఇలా నాసిరకం చీరలను ఇవ్వడాన్ని వారు తప్పపడుతున్నారు.

telangana women fires on mp kavita for distributing quality less sarees

తామంత చులకనగా కనిపిస్తున్నామా? అని హెచ్చరిస్తున్నారు. ఈ చీరలు పంపిణీ చేస్తున్న కవిత.. ఇదే చీర కట్టుకుని బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనగలదా? అని ప్రశ్నిస్తున్నారు. పండుగ పూట రూ.60-రూ.70లకు వచ్చే చీరలను ఎవరైనా కట్టుకుంటారా? అని ప్రశ్నించారు. కొంతమంది మహిళలు ఆ చీరలను రోడ్డు పైనే తగులబెట్టి తమ నిరసన తెలియజేయడం గమనార్హం. అయితే ఇది కింది స్థాయిలో జరిగిన పొరపాటా? లేక కావాలనే ఇలా చేశారా? అన్నది తెలియడం లేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Women firing on MP Kavita for distributing quality less sarees to them. The State government is all set to launch the distribution of ‘Bathukamma’ sarees free of cost to more than one crore women from Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి