ఐసిస్‌లో 7గురు భారతీయులు, తెలంగాణ వ్యక్తి ఒకరు, అక్కడ అతని పని..!
హైదరాబాద్: ఇరాక్, సిరియాల్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో భారతీయులు ఏడుగురు ఉన్నారు. వారిలో ఒక్కరు మాత్రమే పోరు వర్గంలో ఉన్నారు. మిగతా వారు వివిధ విభాగాలలో పని చేస్తున్నారు. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడు.
సమాచారం ప్రకారం.. ముంబైలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు, ఆస్ట్రేలియాకు చెందిన కాశ్మీరీతో పాటు, తెలంగాణ, బెంగళూరు, ఒమన్, సింగపూర్‌కు చెందిన భారతీయులు ఉన్నారు. వీరితో పాటు ఇంతకుముందు మరో ఆరుగురు ఉగ్రవాద సంస్థలో పని చేశారు.

తెలంగాణ నుంచి వెళ్లి ఐసిస్‌లో చేరిన యువకుడు వంటవాడిగా లేదా డ్రైవర్‌గా పని చేస్తుండవచ్చునని తెలుస్తోంది. అతనికి పోరు బాటలో అవకాశం కల్పించలేదని తెలుస్తోంది. మొత్తం ఏడుగురు భారతీయుల్లో ఒక్కరికి మాత్రమే పోరులో అవకాశం కల్పించారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన మొహమ్మద్ హనీప్ వాసీమ్ (27) ఇదివరకు ఐసిస్‌లో చేరి, ఆ తర్వాత సిరియా యుద్ధంలో మృతి చెందాడు. ఆ తర్వాత 15 మంది ఐసిస్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారు ఇరాక్‌కు వెళ్లే ప్రయత్నాలు చేయగా అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications