సినారె పేరుతో మ్యూజియం, స్మారక భవనం: కెసిఆర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త సి. నారాయణ రెడ్డిని స్మరించుకొనేందుకు వీలుగా ఆయన పేరున మ్యూజియాన్ని ఏర్పాటుచేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. నారాయణరెడ్డి భౌతిక కాయం వద్ద కెసిఆర్ మంగళవారం నాడు నివాళులర్పించారు.

తెలంగాణ రాష్ట్రంలోనే కాదు తెలుగు ప్రజలంతా గర్వంగా చెప్పుకొనే కవి నారాయణరెడ్డి అని ఆయన కొనియాడారు. తెలంగాణ సాహితీ మకుటంలో కలికితురాయిగా ఆయన అభివర్ణించారు.

Telanganga governament will establish a memorial on C. Narayana Reddy

ఆది, అంత్యప్రాసాలకు ఆయనకు ఆయనే సాటి అని కెసిఆర్ చెప్పారు. నారాయణరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చే వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను ఏర్పాటుచేసినట్టు కెసిఆర్ చెప్పారు.

ప్రతి జిల్లా కేంద్రంలో బస్సులను ఏర్పాటుచేస్తామన్నారు. ఉచితంగానే ఈ బస్సుల్లో ప్రయాణించి అంత్యక్రియల్లో పాల్గోనాల్సిందిగా కెసిఆర్ చెప్పారు.ఇందుకోసం వంద బస్సులను ఏర్పాటుచేసినట్టు ఆయన చెప్పారు.

సినారె పేరున మ్యూజియాన్ని, స్మారక భవనాన్ని ఏర్పాటుచేస్తామని కెసిఆర్ ప్రకటించారు.రాష్ట్రంలోని ప్రముఖ సంస్థ లేదా యూనివర్శిటీకీ సినారె పేరును పెడతామన్నారు. పూర్వ కరీంనగర్ జిల్లాలో సినారె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telanganga governament will establish a memorial on C. Narayana Reddy said Kcr on Tuesday.Narayana reddy a great poet he said.
Please Wait while comments are loading...