తెలంగాణలో తెలుగు తప్పనిసరి -సీబీఎస్ఈ, ఐబీ 4,9 తరగతులకు -ఇంటర్ ఆన్‌లైన్ క్లాసుల షెడ్యూల్
విద్యా బోధనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లలో తెలుగును ఒక సబ్జెక్ట్‌గా తప్పనిసరిగా బోధించాలని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తప్పనిసరి తెలుగుపై 2018నాటి ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ ఏడాది 4వ. 9వ తరగతులకు తెలుగును తప్పనిసరి చేసింది.
ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం, ప్రైవేటు, ప్రైవేటు ఎయిడెడ్, తెలుగు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో 1 నుంచి 10 వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఇప్పటికే బోధిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధానాన్ని ఇతర మీడియంలు కూడా పాటించాలని సర్కారు పేర్కొంది.

సీబీఎస్, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లు దశలవారీగా ఈ విధానాన్ని అమలు పరచాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది ఒక తరగతి టెక్ట్స్‌బుక్స్‌ను సిద్ధం చేస్తుంటారు. ప్రైమరీ దశలో క్లాస్ 1 నుంచి అదేవిధంగా సెకండరీ లెవల్లో క్లాస్ 6 నుంచి 2018-19 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే,
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. కరోనా మహ్మారి నేపథ్యంలో 2021-22 అకడమిక్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్‌లైన్ లైన్‌క్లాస్‌ల షెడ్యూల్ ను ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి 'దూరదర్శన్', టిశాట్ ద్వారా ఆన్‌లైన్ విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన జరుగుతున్నదని, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు(జనరల్, వొకేషనల్) తమ విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉండేందుకు జులై 1వ తేదీ నుంచే క్లాసులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇక ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ తేదీలను అడ్మిషన్లు పూర్తయిన తరువాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications