హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెగా కాంపౌండ్‌లో శ్రీరామచంద్ర ఎంట్రీ: తెలుగులో బిగ్గెస్ట్ స్టేజ్ షో: సింగర్స్‌‌కు అద్భుత అవకాశం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగులో 15 వారాల పాటు కొనసాగిన బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్‌బాస్ సీజన్ 5 సందడి ముగిసింది. ఈ సీజన్ టైటిల్ కోసం పోటీ పడిన టాప్ 5 కంటెస్టెంట్లు.. రోజూ వార్తల్లో నిలుస్తోన్నారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటోన్నారు. అనారోగ్య కారణాలతో 10వ వారంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన జెస్సీ అలియాస్ జశ్వంత్ పడాల.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎర్రర్ 500 అనే మూవీలో లీడ్ క్యారెక్టర్‌లో నటిస్తోన్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది కూడా.

మెగా కాంపౌండ్‌లో..

మెగా కాంపౌండ్‌లో..

టాప్ 3లో నిలిచిన ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర బంపర్ ఆఫర్‌ను సాధించాడు. ఏకంగా మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెట్టాడు. అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో బిగ్గెస్ట్ స్టేజ్ షోను నిర్వహించబోతోన్నాడు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. సుదీర్ఘకాలం పాటు సాగే స్టేజ్ షో ఇది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఓ గొప్ప అవకాశాన్ని అందుకున్నాడు.

తెలుగులో ఇండియన్ ఐడల్..

దీని పేరు- తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol). గాయనీ, గాయకుల కోసం ఏర్పాటు చేసిన షో ఇది. గ్రామస్థాయిలో గాయకులను ప్రోత్సహించడానికి, వారిని సంగీత ప్రపంచానికి పరిచయం చేయడానికి ఉద్దేశించిన స్టేజ్ షో ఇది. హిందీలో సోనీ టీవీ ఇండియన్ ఐడల్ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. దేశంలో మారుమూల గ్రామాల్లో ఉన్న సింగర్స్‌ను గుర్తించడానికి ఈ షోను నిర్వహిస్తూ వస్తోందా ఛానల్ యాజమాన్యం.

బిగ్గెస్ట్ స్టేజ్ షో..

ఈ ఇండియన్ ఐడల్ సీజన్ 5 విన్నర్‌గా నిలిచాడు శ్రీరామచంద్ర. ఇండియన్ ఐడల్ విన్నర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు అదే తరహాలో ఆహా ప్రారంభించిన తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ షోనకు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ బిగ్గెస్ట్ స్టేజ్ షోను సమర్థవంతంగా నడిపించడానికి పాటపై మంచి పట్టు ఉండాలి. ఆ అర్హత ఉన్న ఏకైక సింగర్‌గా శ్రీరామచంద్రను గుర్తించింది ఆహా మేనేజ్‌మెంట్. ఈ అవకాశాన్ని అతనికి ఇచ్చింది.

ఆడిషన్స్ షురూ..

ఆడిషన్స్ షురూ..

తెలుగులో ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ కూడా మొదలయ్యాయి. ఆదివారం తొలి ఆడిషన్స్ నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ ఫిల్మ్‌నగర్‌లోని ఒయాసిస్ స్కూల్‌లో ఆడిషన్స్ పూర్తయ్యాయి. 14 నుంచి 30 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారు ఇందులో పాల్గొనడానికి అర్హులు. పాల్గొనదలిచిన వారు తెలుగు పాటలు మాత్రమే పాడాల్సి ఉంటుంది. ఇండియన్ ఐడల్ టీమ్ మెంటార్స్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఫస్ట్ రౌండ్‌లో సెలెబ్రిటీ న్యాయ నిర్ణేతలు లేరు.

నో ప్రీరిజిస్ట్రేషన్..

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1లో పాల్గొనడానికి ఎలాంటి ప్రీ-రిజిస్ట్రేషన్ అవసరం లేదు. నేరుగా ఆడిషన్స్‌లో పాల్గొనవచ్చు. అక్కడే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫలానా జానర్‌కు చెందిన పాటలు మాత్రమే పాడాలనే నిబంధన ఏదీ లేదు. తెలుగులో ఏ జానర్‌కు చెందిన పాటైనా పాడవచ్చు. ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయిన తుది 16 మందిని ఎంపిక చేస్తారు. వారితో తెలుగులో ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

 వరుసగా ప్రోగ్రామ్స్..

వరుసగా ప్రోగ్రామ్స్..

ఎక్స్‌క్లూజివ్‌గా తెలుగులో ఆరంభమైన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహా వరుస టాక్ షో, స్టేజ్ షోలను నిర్వహణతో దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని విధంగా నటసింహం నందమూరి బాలకృష్ణను హోస్ట్‌గా మార్చివేసింది. ఆయన సారథ్యంలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేను నిర్వహిస్తోంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టాక్‌షోగా నిలిచిందీ ప్రోగ్రామ్. ఇది విజయవంతం కావడంతో తెలుగులో ఇండియన్ ఐడల్ స్టేజ్‌ షోను డిజైన్ చేసింది.

English summary
Telugu OTT streaming platform, Aha, to launch one of the world’s biggest stage show Telugu Indian Idol in the line of Sony's Indian Idol. former Indian Idol winner and Bigg Boss 5 Telugu contestant Sreerama Chandra will host this program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X