అమెరికాలో మరో కలకలం: తెలుగు టెక్కీ మధురెడ్డి ఆత్మహత్య!..
బంధువులు మాత్రం మధురెడ్డికి ఎలాంటి ఆర్థిక సమస్యలకు కానీ వివాదాలు కానీ లేవని బంధువులు చెబుతున్నారు.
నల్గొండ: అమెరికాలో తల్లికొడుకుల దారుణ హత్య ఘటన మరవకముందే మరో విషాదం చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మధురెడ్డి అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా రాళ్ల జనగామ మధురెడ్డి స్వగ్రామం.
యూఎస్ లోని సియాటెల్ లో మధురెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. కాగా, మధురెడ్డికి భార్య, కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మధురెడ్డి ఆత్మహత్యకు సంబంధించి ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు. బంధువులు మాత్రం మధురెడ్డికి ఎలాంటి ఆర్థిక సమస్యలకు కానీ వివాదాలు కానీ లేవని బంధువులు చెబుతున్నారు.

మధురెడ్డి ఆత్మహత్య వార్త తెలియగానే ఆయన స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications