సంకీర్త్ హత్యకు కారణమేమిటో!: కలల అమెరికాలో బలవుతున్నారు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అమెరికా వెళ్తున్న కొందరు మన విద్యార్థులు మృత్యువాత పడుతూ, తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. అమెరికా వెళ్లాలని కలలు కని, అక్కడకు వెళ్లాక కొందరు ప్రమాదాల బారిన పడటం లేదా, కాల్పులలో మృతి చెందుతున్నారు.

తాజాగా, హైదరాబాదులోని కాచిగూడకు చెందిన సంకీర్త్.. మరో తెలుగు విద్యార్థి సాయి సందీప్ చేతిలో హత్యకు గురయ్యాడు. ఇది అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అమెరికాలోని అరిజోనాలో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న వనస్థలిపురానికి చెందిన శ్రీదత్త ఉదంతం వెలుగు చూసి, నెల రోజులు కాకముందే ఇప్పుడు సంకీర్త్ హత్య చోటు చేసుకుంది. శ్రీదత్త గత నెల జరిగిన ప్రమాదంలో అమెరికాలో మృతి చెందారు.

నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నారు. టీసీఎస్‌లో సీవీఎస్ హెల్త్ నెట్ వర్క్ ఇంజినీర్‌గా పని చేశారు. వీకెండ్లో స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు వెళ్లి, ప్రమాదవశాత్తు లోతుగా ఉన్న నీటిలో పడి మృతి చెందారు.

తాజాగా, సంకీర్త్‌కు కూడా రూమ్మెట్ సాయి సందీప్‌తో ఆదివారం గొడవ జరిగింది. ఆ తర్వాత రోజు కత్తితో పొడిచి హత్య గావించబడ్డాడు.

Telugu student stabbed to death by roommate in USA

ఇటీవలి కాలంలో పలువురు మృతి చెందారు. చందానగర్‌కు చెందిన సుప్రజ, తన ఆరు నెలల కుమారుడితో సహా అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన 14వ తేదీన వెలుగు చూసింది. ఇది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో జరిగింది.

కాచిగూడ నింబోలి అడ్డాకు చెందిన మహ్మద్ షఫీక్ అహ్మద్ సౌదీ అరేబియాలోని అల్ జుబియల్‌లో చనిపోయినట్లు ఈ నెల 14న కుటుంబ సబ్యులకు సమాచారం వచ్చింది.

కూకట్ పల్లిలో ఉంటున్న పూర్ణచంద్ర రావు కూతురు రమ్యకృష్ణ తన భర్త మహంత్‌కతో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. మే 18న ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

హైదరాబాదుకు చెందిన ఓ పోలీస్ అధికారి కూతురు ప్రణీత అమెరికాలోని రైట్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేవారు. ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.సంతోష్ నగర్‌కు చెందిన ప్రశాంత్ అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు.కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాదుకు చెందిన సంతోష్ కుమార్ మృత్యువాత పడ్డారు.

అట్లాంటాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువ ఇంజినీర్ ధీరజ్ రెడ్డి మృతి చెందారు.కూకట్ పల్లికి చెందిన సత్యవారాయణ కూతురు ప్రియదర్శిని రోడ్డు ప్రమాదంలో అమెరికాలో మృతి చెందారు.

హైదరాబాదుకు చెందిన సాఫ్టువేర్ ఇంజినీర్ అపర్ణ అమెరికాలో తన ప్లాట్లో హత్యకు గురయ్యారు. సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటి విద్యార్థులు సౌమ్య, విక్రమ్‌లు చికాగోలో కన్నుమూశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Telugu student was killed by his roommate, compatriot Sai Sandeep in their room on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి