Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"బంగారం" వరాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్దం..!!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమైంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అంటూ హామీలు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వీటి గురించే ప్రధానంగా వివరిస్తున్నారు. ఈ సారి తెలంగాణలో అధికారం రావటం ఖాయమనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ మరిన్ని వరాల ప్రకటనకు సిద్దమైంది. బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగుతున్న ఈ వార్ లో ఎక్కడా అవకాశం వదులుకోవద్దని భావిస్తోంది. దీంతో, కీలక హామీలతో మేనిఫెస్టో పార్టీ విడుదల చేయనుంది.

మేనిఫెస్టోలో కీలక అంశాలు:తెలంగాణ కాంగ్రెస్ మరిన్ని ఆకట్టుకొనే ప్రకటనలకు సిద్దమైంది. రేపు (శుక్రవారం) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే రేపు తెలంగాణ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. రాహుల్ పినపాక, పరకాల, వరంగల్ ఈస్ట్,రాజేంద్రనగర్ లో పర్యటించి ప్రచారం చేయనున్నారు. ఖర్గే కుత్బుల్లాపూర్ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమలు చేస్తామని హామీ ఇస్తోంది. బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో తమ హామీలనే కాపీ కొట్టిందనేది కాంగ్రెస్ వాదన. ఇక, ఆరు గ్యారెంటీలతో పాటుగా కాంగ్రెస్ ఈ సారి మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలు ఆసక్తి కరంగా మరాయి.

Ten grams of gold to eligible women: T Congress to announce in poll manifesto

తులం బంగారం ప్రకటిస్తారా:మేనిఫెస్టోలో ప్రధానంగా ధరణి స్థానంలో భూ భారతి పేరుతో అప్ గ్రేడ్ చేసిన యాప్ తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వనుంది. గ్రామ వార్డుసభ్యులకు గౌరవ వేతనం, రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటుగా కమిషన్ గురించి స్పష్టమైన హీమ ఇవ్వనున్నట్లు సమాచారం. అభయ హస్తం పథకం తిరిగి పునరుద్దరించనున్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు కార్డుల పై హామీ ఇవ్వనుంది. అమ్మహస్తం పేరుతో 9 నిత్యావసరాల వస్తువుల పంపిణీకి మేనిఫెస్టో ప్రస్తావన చేయనుంది. ఎంబీసీలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు పైన స్పష్టత ఇవ్వనున్నారు. పెళ్లికూతురు కానుకగా లక్ష తో పాటుగా తులం బంగారం ఇచ్చే ప్రతిపాదనను మేనిఫెస్టోలో చేర్చినట్లు సమాచారం. రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వనుంది.

యువతను ఆకట్టుకొనేలా:ఉద్యోగులు, యువతకు సంబంధించిన అంశాలను మేనిఫెస్టోలో చేర్చుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సీపీఎస్ రద్దు గురించి కాంగ్రెస్ హామీ ఇవ్వనుంది. యువతకు ఉద్యోగ కల్పన..జాబ్ క్యాలెండర్ పైన తమ విధానం ఎలా ఉండేది కాంగ్రెస్ నేతలు తమ మేనిఫెస్టోలో వెల్లడించనున్నారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుండటంతో ఈ మేనిఫెస్టోలో మరోసారి రైతులకు నిరంతర విద్యుత్ పైన హామీ ఇస్తారని సమాచారం. ఇక, సరిగ్గా పది రోజల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో..ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించే అంశాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+