వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, టెన్నిస్ స్టార్ సానియాకు ఖేల్ రత్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ఇస్తోంది. టెన్నిస్ ఆటలో విశేష కృషి చేసినందుకు సానియాకు కేంద్రం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించనుంది.

సానియా మీర్జా తెలంగాణలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఆమె టెన్నిస్‌లో డబుల్స్ విభాగంలో పతకాల పంట పండిస్తోంది. డబుల్స్ విభాగంలో ఆమె ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది.

రాజీవ్ ఖేల్ రత్నకు ఆరుగురు క్రీడాకారులు పోటీ పడ్డారు. కమిటీ సభ్యులు సానియా వైపు మొగ్గు చూపారు. కేంద్రం అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది.

కాగా, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేరుని రాజీవ్ ఖేల్‌ రత్న అవార్డుకు కేంద్ర క్రీడా శాఖ ఇటీవలే ప్రతిపాందించింది. శనివారం అవార్డుల కమిటీకి సానియా పేరును కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ ప్రతిపాదన చేశారు.

Tennis ace Sania Mirza to be awarded Rajiv Gandhi Khel Ratna award

క్రీడా రంగంలో ఎక్కువ పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సానియా ఉందని, అందుకే ఆమె పేరును ప్రతిపాదిస్తున్నామని క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ అప్పుడు చెప్పారు.

2014 ఏసియన్ గేమ్స్, యూఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో బంగారు పతకాల్ని సాధించి దేశ గౌరవాన్ని మరింతగా పెంచినందుకు ఖేల్ రత్న అవార్డుకు ఆమెను ప్రతిపాదించినట్లు క్రీడల శాఖ పేర్కొంది. ఈ అవార్డుకి సానియా మిర్జా ఇటీవల సాధించిన మహిళల డబుల్స్ వింబుల్డన్ టైటిల్‌ను లెక్కలోకి తీసుకోలేదు.

సానియా మిర్జాకు 2004లో అర్జున, 2006లో పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం బహుకరించింది. సానియా మిర్జాతో పాటు రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు 11 మంది పోటీ పడ్డారు. ఈ పోటీలో స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ తదితరులు ఉన్నారు.

English summary
Indian tennis queen Sania Mirza is set to be awarded the Rajiv Gandhi Khel Ratna award according to reports on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X