జనగామ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండి సంజయ్ పాదయాత్రలో మళ్ళీ ఉద్రిక్తత: పోలీసుల లాఠీచార్జ్.. అసలేం జరిగిందంటే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర టెన్షన్ కు కారణంగా మారింది. వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్రలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వరంగల్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర ప్రవేశించిన నాటి నుండి అనేక ఘర్షణలు చోటుచేసుకోవడంతో పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ పాదయాత్రతో చోటు చేసుకుంటున్న ఉద్రిక్తత నేపథ్యంలో పాదయాత్ర ఆపివేయాలని పోలీసులు భావించి నోటీసులు జారీ చేసినా, హైకోర్టు బండి సంజయ్ పాదయాత్రను కొనసాగించడానికి ఆదేశాలిచ్చింది. దీంతో ప్రస్తుతం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే తాజాగానూ పాదయాత్రలో టెన్షన్ చోటు చేసుకుంది.

బండి సంజయ్ పాదయాత్రలో మరోమారు ఉద్రిక్తత


తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రగడకు కారణంగా మారిన బండి సంజయ్ పాదయాత్రలో మరోమారు ఉద్రిక్తత చోటు చేసుకుంది. జఫర్ గడ్ మండలం కూనూరులో ఓ టీఆర్ఎస్ కార్యకర్త బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే యత్నం చేశాడు. దీంతో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. కర్రలతో విరుచుకుపడ్డారు. ఇక పోలీసులు లాఠీచార్జి చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇది కావాలనే టీఆర్ఎస్ చేస్తున్న కుట్ర అని మండిపడుతున్నారు బీజేపీ శ్రేణులు.

పాదయాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తపై బీజేపీ శ్రేణుల దాడితో ఉద్రిక్తత


జనగామ జిల్లా జఫర్ గడ్ మండలంలోని కూనూరులో బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్న క్రమంలో పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందని ఓ స్థానికుడు బండి సంజయ్ ను నిలదీశాడు. పోలీసులు అతడిని నిలువరించకపోవటంతో బిజెపి కార్యకర్తలు అతను బండి సంజయ్ పాదయాత్రకు విఘాతం కలిగించటానికి ప్రయత్నిస్తున్నాడని, అది టీఆర్ఎస్ కుట్రలో భాగమని అతనిపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.

పోలీసుల లాఠీ చార్జ్.. బీజేపీ కార్యకర్తలకు గాయాలు, కొనసాగుతున్న పాదయాత్ర

దీంతో కెసిఆర్ కు వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తలు నినాదాలు చేశారు. బిజెపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటన పై పోలీసుల తీరుపై బిజెపి శ్రేణులు మండిపడుతున్నారు. పోలీసులు టిఆర్ఎస్ పార్టీ కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు ఉద్రిక్తత తరువాత పరిస్థితి శాంతించింది. తిరిగి యధావిధిగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది.

కావాలనే పాదయాత్రలో ఘర్షణలకు దిగుతున్న టీఆర్ఎస్ .. ఆరోపించిన బండి సంజయ్

ప్రజల కోసం పాదయాత్ర చేస్తుంటే పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తూ ప్రభుత్వం రాక్షసానందం పొందుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులతో పాదయాత్రను ఆపాలని ప్రయత్నించిందని, కోర్టు ఆదేశాలతో న్యాయం తమ వైపే ఉందని వెల్లడైందని బండి సంజయ్ పేర్కొన్నారు. కావాలని పాదయాత్రలో గొడవలు చేయడానికి టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని, ఆ వంకతో పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తోందని బండి సంజయ్ మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ పాదయాత్రను ఆపేది లేదని, కోర్టు అనుమతితో బహిరంగ సభను సైతం నిర్వహించి తీరుతామని బండి సంజయ్ స్పష్టం చేస్తున్నారు.

English summary
Tension in Bandi Sanjay's padayatra in jafargadh mandal of Jangaon district. trs activist nuesence in bandi sanjay padayatra created tension in padayatra. bjp activists attacked TRS activist, and with this police did lathi charge on bjp activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X