జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో దాడులు - ఉద్రిక్తత..!!

జీహెచ్ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైనప్పట్నుంచీ టెన్షన్ వాతావరణమే నెలకొంది. అనుకున్నట్లుగానే కార్పొరేటర్లు ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్.. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నట్లు సమాచారం. కౌన్సిల్‌లో పరిస్థితులు అదుపులో లేకుండా పోయాయి. ప్లకార్డులు చూపించుకున్న అంశంపై మొదలైన ఈ గొడవ కొట్టుకునే పరిస్థితికి వెళ్లింది. కౌన్సిల్‌ను కంట్రోల్ చేయలేక.. ఉద్రిక్త పరిస్థితుల మధ్యే సభ నుంచి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెళ్లిపోయారు.

ఉదయం నుంచి కౌన్సిల్‌ రచ్చ రచ్చగానే సాగింది. కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పలువురు కార్పొరేటర్లు మేయర్‌తో వాగ్వాదానికి దిగారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సమావేశ మందిరంలో గందరగోళం కొనసాగింది.

Tension erupts at GHMC Counicl meeting BRS demands Mayor resignation

కార్పొరేటర్లను తమ స్థానాల్లో కూర్చోవాలని సభ్యులను కోరినప్పటికీ వారు వినకపోవడంతో సమావేశాన్ని 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశం ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పురాలేదు. బీఆర్‌ఎస్‌ సభ్యులు మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో ఆమె తన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. బీఆర్‌ఎస్‌లో కొనసాగిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌, పలువురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దీంతో సభలో విచిత్ర పరిస్థితి నెలకొంది. గడిచిన కొన్ని నెలలుగా జంపింగ్‌ జపాంగ్‌లు ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులతో నేటికీ బీఆర్‌ఎస్‌ మాత్రమే బలంగా ఉంది. కాగా, మేయర్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీ అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+