ఢిల్లీలో ఉద్రిక్తత: బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం, ఆందోళనలు; మహిళా కమీషన్ కు ఫిర్యాదు!!

ఢిల్లీలో ఈడీ విచారణ వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహిళా కమీషన్ కు ఫిర్యాదు చెయ్యనున్నారు బీఆర్ఎస్ నాయకులు.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఒకపక్క కవితను ఈడీ ప్రశ్నిస్తుండగా, మరోపక్క ఢిల్లీలోనూ, ఇటు హైదరాబాద్లోనూ బీఆర్ఎస్ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతల ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు మండిపడుతున్నారు. కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున దుమారం చోటుచేసుకుంది.

కవిత పై బండి వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఆందోళనలు

కవిత పై బండి వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఆందోళనలు


ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళుతుందని, కెసిఆర్ కుటుంబం నుంచి ఒక వికెట్ పడుతుందని బండి సంజయ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అంటూ పేర్కొన్న బండి సంజయ్ చట్టసభల్లో మహిళా బిల్లుపై దీక్ష చేసే అర్హత కవితకు లేదని మండిపడ్డారు. కవిత ముందు ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలని తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద కవిత ఎందుకు స్పందించడం లేదని కేసీఆర్ ను ప్రశ్నిస్తే బాగుంటుందని విమర్శలు గుప్పించారు. ఇక నేపధ్యంలో కవితను అరెస్ట్ చెయ్యకుండా ముద్దు పెట్టుకుంటారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

బండి సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం

బండి సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం

ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బండి సంజయ్ కు కేంద్రం లోని బీజేపీ తీరుకు నిరసనగా దిష్టి బొమ్మ దహనం చేశారు. ఇటు హైదరాబాద్ నగరంలోనూ బండి సంజయ్ దిష్టిబొమ్మను అనేక చోట్ల దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఇక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

ఈడీ కార్యాలయం ముందు పోలీసుల బందోబస్తు, మహిళా కమీషన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

ఈడీ కార్యాలయం ముందు పోలీసుల బందోబస్తు, మహిళా కమీషన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు


ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత విచారణ, నగరంలో బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో బషీర్ బాగ్ లో ఉన్న ఈడీ కార్యాలయానికి తాళాలు వేసి పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక బండి సంజయ్ తీరుపై మాలోతు కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న బండి సంజయ్ ని వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని కవిత డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ, చుక్కలు చూపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు బీఆర్ఎస్ మహిళా నాయకులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+