ఆ ఇంటి నుంచి అత్యధిక కాల్స్ పాకిస్తాన్ కే! అసలేం జరుగుతోంది?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ను దారిమళ్లించే అక్రమ వ్యవహారం వెనుక ఉగ్రకోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ పాకిస్తాన్ కు వెళ్లడం, పరారీలో ఉన్న మరో నిందితుడు మతీనుద్దీన్ గతంలో కాల్ రూటింగ్ కేసుల్లో పట్టుబడడం, అరెస్టయిన ఫహాద్ అహ్మద్, రఫీక్ అహ్మద్ సిద్దిఖీలు నిర్వహిస్తోన్న మినీ టెలిఫోన్ ఎక్స్ ఛేంజి.. ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

ఇండియన్ ముజాహిదీన్, ఐసిస్ ఉగ్రవాద సంస్థల సభ్యులు ఇక్కడి నుంచి తమ నేతలను సంప్రదించేందుకు తండ్రీకొడుకులను ఉపయోగించుకుంటున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశభద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలున్న దృష్ట్యా ఈ కేసును 'సిట్'కు బదిలీ చేశామని డీసీపీ అవినాష్ మొహంతి తెలిపారు. ఇద్దరు నిందితులను విచారించేందకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్థించామన్నారు. పరారీలో ఉన్న మతీనుద్దీన్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారా?

అంతర్జాతీయ ఫోన్ కాల్స్ ను అక్రమంగా మళ్లిస్తున్న అహ్మద్ సిద్దిఖీ వ్యవహారంపై అనుమానాలున్నందునే ఉగ్రకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అహ్మద్ సిద్దిఖీ తన పేరు, చిరునామా బయటికి రాకుండా మహ్మద్ రహ్మతుల్లా, టోలీచౌకీ చిరునామాతో కొన్న నెలల క్రితం ఓ ప్రైవేటు సంస్థ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నాడు.

Terrorist Angle Behind Call Routing Activity?

దీని సహాయంతో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(వీవోఐపీ) ద్వారా విదేశాల్లో ఉన్న వారితో తన ఖాతాదారులతో మాట్లాడిస్తున్నాడు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు టోలీచౌకీలోని చిరునామాకు వెళ్లగా.. అక్కడ ఎవరూ లేరు. దీంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆగాపురాలోని అహ్మద్ సిద్దిఖీ నివాసాన్ని గుర్తించారు. అక్కడ ఒకేసారి 100 మంది మాట్లాడేందుకు వీలుగా 100 సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నారు.

అత్యధిక కాల్స్ పాకిస్తాన్ కే...

అహ్మద్ సిద్ధిఖీ, ఫహాద్ అహ్మద్ లు వినియోగిస్తున్న ల్యాప్ టాప్ లలో ఎవరెవరు ఫోన్లు చేశారన్న వివరాలు లేవు. కానీ కొన్ని అవుట్ గోయింగ్ కాల్స్ ను విశ్లేషించగా.. 85 శాతం పాకిస్తాన్ కే వెళ్లినట్లు గుర్తించారు.

వీరితోపాటు రాజేంద్రనగర్ లో కాల్స్ మళ్లింపు రాకెట్ ను నిర్వహిస్తున్న మతీనుద్దీన్ గతంలో ఇదే నేరానికి పాల్పడి మూడుసార్లు అరెస్టయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు మళ్లీ పాత కేసులను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో మరిన్ని కాల్ రూటింగ్ కేంద్రాలు ఉన్నట్లు వారు భావిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A day after Hyderabad police claimed to have busted an international call racket after raiding a house in Habeeb Nagar here, a father-son duo was today arrested allegedly in connection with the case. Fahad Ahmed Siddiqui and his father Waseem Ahmed Siddiqui, were held on charge of illegally routing international calls by terminating the international incoming calls through Internet using VoIP (Voice over Internet Protocol) Gateway equipment, a release from Hyderabad Police said.
Please Wait while comments are loading...