తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో టెట్ నిర్వహించాలని నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ రాసేందుకు అర్హులు. కాగా, చివరి సారిగా రాష్ట్రంలో గత ఏడాది జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే.
విద్యాశాఖలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో సమస్యతోపాటు టీచర్ పోస్టుల భర్తీ, మన ఊరు-మన బడి పురుగోతిపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయ్యింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.

డిగ్రీ కాలేజీల్లో 2,858 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు:నిరుద్యోగులకు మంచి అవకాశం అందించింది రాష్ట్ర సర్కారు. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిన 527 మంది లెక్చరర్లను, 341 మందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిన, 50 మంది టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంటర్లను హోనరేరియం కింద, 1,940 మందిని గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అయితే ఈ పోస్టుల కాలపరిమితి 2024, మార్చి 31తో ముగియనుంది.
పోస్టుల వివరాలు:
లెక్చరర్లు -527
టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంటర్లు - 50
గెస్ట్ ఫ్యాకల్టీ - 1,940
సీనియర్ అసిస్టెంట్ -29
డాటా ఎంట్రీ ఆపరేటర్ - 31
స్టోర్ కీపర్ - 40
జూనియర్ స్టెనో - 01
రికార్డు అసిస్టెంట్ - 38
మ్యూజియం కీపర్ -07
హెర్బేరియం కీపర్ -30
మెకానిక్ - 08
ఆఫీసు సబార్డినేట్ - 157 పోస్టులు ఉన్నాయి.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications