హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలోనే తెలంగాణలో టెట్: సీఎం కేసీఆర్ ఆదేశించారంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు త్వరలోనే శుభవార్త రానుంది. తెలంగాణలో త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాజాగా ప్రకటించారు. టెట్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆమె తెలిపారు.

ఈ క్రమంలో త్వరలో టెట్ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మంత్రి సబిత వెల్లడించారు. అలాగే ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రతి యూనివర్సిటీ పరిధిలో ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలను సైతం త్వరలో చేపడతామన్నారు.

మరోవైపు మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఎవరైనా స్కూళ్ల అభివృద్ధి కోసం విరాళాలు ఇస్తే వారికి తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు మంత్రి సబిత చెప్పారు. ఫీజుల నియంత్రణ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో స్కూళ్లలో ఫీజులపై నిర్ణయం తీసుకుంటామని ఆమె ప్రకటించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని స్పష్టం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలపై నివేదిక తెప్పించుకున్నా మని.. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని సబిత తెలిపారు.

TET will held soon in Telangana: minister Sabitha Indra Reddy

ఇది ఇలావుండగా, 80వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి తొలి నోటిఫికేషన్‌ పోలీసు శాఖ నుంచి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి( TSLPRB) కసరత్తు మొదలుపెట్టింది.

Recommended Video

TPCC Women Congress President Sunitha Rao Curses CM KCR | Oneindia Telugu

ఇందులో భాగంగా జోన్ల వారీగా ఖాళీల జాబితాను సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. దీనికి ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్‌ వెలువడనుంది. ప్రస్తుతమున్న సమచారం ప్రకారం ఈ నెలాఖరున లేదంటే ఏప్రిల్‌ మొదటి వారంలో పోలీసుల ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీసుశాఖలో సుమారు 18 వేలకుపైగా ఖాళీలున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే నోటిఫికేషన్‌.. కాగా ప్రభుత్వం శాఖల వారీగా ప్రకటించిన ఖాళీలను భర్తీ చేయాలంటే కొంత సమయం పడుతుంది.

English summary
TET will held soon in Telangana: minister Sabitha Indra Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X