ఆరు గ్యారంటీల కు నిధులు - కల్యాణలక్ష్మి అమలు నిర్ణయం..!!

Telangana Budget 2025: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు. 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. ఈ బడ్జెట్ లో భట్టి రెవెన్యూ వ్యయం - రూ.2,26,982 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం - రూ.36, 504 కోట్లు గా పేర్కొన్నారు. సంక్షేమంతో పాటుగా ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయింపులు చేసారు.

హామీల అమలు కోసం
డిప్యూటీ సీఎం భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావన చేసా రు. ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఆర్దికంగా సమస్యలు ఉన్నా..హామీల అమలు దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు కేటాయింపులు చేసారు. రైతు భరోసా - రూ.18 వేల కోట్లు, చేయూత పింఛన్లు - రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లు - రూ.12,571 కోట్లు, మహాలక్ష్మి (ఆర్టీసీ బస్సు) రూ.4,305 కోట్లు,
గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లు, సన్నాలకు బోనస్ - రూ.1,800 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ - రూ.1,143 కోట్లు, గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ - రూ.723 కోట్లు ప్రతిపాదన చేసినట్లు భట్టి వివరించారు.

TG Govt allocations for six guarantees in the Budget 2025-26 details here

సంక్షేమానికి ప్రాధాన్యత
అదే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా - రూ.600 కోట్లు, విద్యుత్ రాయితీ - రూ.11,500 కోట్లు, రాజీవ్ యువ వికాసం రూ.6 వేల కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ లో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. షెడ్యూల్ కులాల సంక్షేమం కు 40,234 కోట్లు కేటాయించిన రేవంత్ ప్రభుత్వం.. షెడ్యూల్ తెగలకు 17,169 కోట్లు , వెనుకబడిన తరగతుల శాఖకు 11,405 కోట్లు, చేనేత రంగానికి 371 కోట్లు , మైనారిటీ సంక్షేమం కు 3,591 కోట్లు కేటాయించారు. అదే విధంగా.. పరిశ్రమల శాఖకు 3,527 కోట్లు , ఐటీ శాఖ కు 774 కోట్లు , విద్యుత్ శాఖకు 21,221 కోట్లు కేటాయింపులు చేసారు. వైద్య ఆరోగ్య శాఖకు 12,393 కోట్లు, మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు 17,677 కోట్లు, నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు కేటాయించారు.

కల్యాణ లక్ష్మి కోసం
బడ్జెట్ లో ఎస్డీఎఫ్ , సీడీపీ నిధులు రూ.3,300 కోట్లు గా పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూ.2,900 కోట్లు, విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల మెరుగుద ల - రూ.500 కోట్లు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి - రూ.100 కోట్లు, ఇందిరా గిరి జల వికాసం - రూ.600 కోట్లు, నగరాభివృద్ధి - రూ.వెయ్యి కోట్లు, పర్యాటక ప్రాజెక్టులు - రూ.721 కోట్లు,గ్రామాల్లో వంద శాతం సౌర విద్యుత్ - రూ.1,500 కోట్లు, గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం - రూ.వెయ్యి కోట్లు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు - రూ.1,511 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ - రూ.3,683 కోట్లు, ఉపకారవేతనాలు - రూ.4,452 కోట్లు, బియ్యం రాయితీ - రూ.3 వేల కోట్లు,రైతు బీమా - రూ.1,589 కోట్లు కేటాయింపులు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+