రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం తాజా నిర్ణయం..!!

తెలంగాణ ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. అయితే, ఇంకా కొందరికి రుణమాఫీ జరగలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అర్హత ఉండి రుణమాఫీ కాని రైతుల కోసం తాజాగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రైతులు ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. వ్యవసాయ శాఖ చేసిన తాజా సర్క్యులర్ తో రైతులకు ఉపశమనం కలుగుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ ఈ నెల 15లోగా రూ 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగా రూ 2 లక్షల రుణమాఫీ చివరి విడత ఈ నెల 15న జమ చేసారు. చెప్పిన విధంగా రైతులకు రుణ విముక్తులను చేసామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, అర్హత ఉన్నా కొందరికి రుణమాఫీ జరగలేదనే ఫిర్యాదులు ఉన్నాయి. రైతులు తమ రుణమాఫీ గురించి బ్యాంకులు..అధికారులను ఆరా తీస్తున్నారు. దీంతో, వీరి గురించి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

Tg govt orders for special drive on loan wiaver for famers across the state

అర్హత ఉండి రుణమాఫీ జరగని రైతుల కోసం వ్యవసాయ శాఖ తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది. రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పేర్కొంది. ఆదార్ కార్డు తప్పుంటే.. రైతుల వద్దకు వెళ్లి దాన్ని పరిశీలించి మళ్లీ తీసుకోవాలని, ఓటర్ కార్డు, వాహన లైసెన్స్, రైతు రేషన్ కార్డు లాంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను రైతుల నుంచి తీసుకోవాలని పోర్టల్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి రుణమాఫీ చేసేలా చర్యలు తీసుకోనున్నారు. దీని ద్వారా బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరగకుండానే రైతులకు రుణమాఫీ జరగుతుందని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+