నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం- ఇలా చేయండి..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కులం సర్టిఫికెట్ ఇక నుంచి కేవలం రెండు నిమిషాల్లోనే పొందే అవకాశం కల్పించింది. ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ నిర్ణయంలో భాగంగా మీసేవా కేంద్రాల్లో ఆధార్ నంబర్ ద్వారా రెండు నిమిషాల్లో పొందే విధంగా మార్పులు తీసుకొచ్చింది. నిర్ణీత రసుము చెల్లించి.. ఆధార్ నెంబర్ చెప్పి రెండు నిమిషాల్లోనే వీటిని పొందవచ్చని అధికారులు వెల్లడించారు.
కుల ధ్రువీకరణ పత్రాన్ని త్వరగా పొందడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గతంలో కుల ధ్రువీకరణ పత్రం తీసుకొని, మళ్లీ అవసరం ఉన్నప్పుడు తీసుకోవడానికి ప్రస్తుతం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మీసేవా కేంద్రానికి వెళ్లి రూ.45 రుసుం చెల్లించి ఆధార్ నెంబర్ చెప్పటం ద్వారా సర్టిఫికెట్ పొందవచ్చు. అందుకు వారు ఇదివరకే కుల ధ్రువీకరణ పత్రం తీసుకుని ఉండాలి. అయితే, ఎస్సీ హిందూ సామాజిక వర్గానికి మాత్రం వర్తించదని పేర్కొన్నారు. మీ-సేవ పరిధిలో కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజల సౌకర్యార్థం కోసం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో ప్రైవేటు సైట్లోనే అందుబాటులోనే ఉండగా, ప్రస్తుతం వీటని ప్రభుత్వం మీసేవా పరిధిలోకి తీసుకొచ్చింది.

అందులో భాగంగా నిరంతరం ప్రజలతో మమేకం అయ్యే రెవెన్యూ, అటవీ, సంక్షేమ శాఖలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి గ్యాప్ సర్టిఫికేట్, పౌరుని పేరు మార్పు, స్థానికత, మైనార్టీ, క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్, సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్, మానిటరింగ్, వన్యప్రాణుల దాడిలో పరిహారం, సామిల్, టింబర్ డిపో, తదితర వాటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వీటితో పాటు హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్, నాన్ అగ్రికల్చర్ మార్కెట్ వాల్యూవ్ సర్టిఫికెట్ , పాన్ కార్డు సవరణ, ఇసుక బుకింగ్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో ఈ రకమైన సర్టిఫికెట్ల కోసం దాదాపు 15 రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు రెండు నిమిషాల్లోనే పొందే వెసులుబాటు కలిగింది.












Click it and Unblock the Notifications