ఒక్క జీవోతో వేల మంది పై రేవంత్ వేటు..!!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే ఆర్డర్ తో 6,729 మంది పైన వేటు వేసింది. ప్రభుత్వంలో పలు శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న పదవీ విరమణ చేసి, కాంట్రాక్టుపై పని చేస్తున్న వారిపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో అటెండర్‌ నుంచి ఐఏఎస్‌ల దాకా ఉన్నారు. ఈ జాబితాలో హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తో పాటుగా మరికొందరు ముఖ్య అధికారులు ఉన్నారు. వీరి స్థానంలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ నిర్ణయం ప్రభుత్వంలో సంచలనంగా మారింది.

ఒక్క జీవోతో వేటు
ముఖ్యమంత్రి రేవంత్ పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుదీర్ఘ కాలంగా రిటైర్ అయినా కీలక హోదాల్లో కొనసాగుతున్న వారి పైన వేటు వేసారు. ఏకంగా 6,729 మందిని ఒక జీవోతో ఇంటికి పంపారు. ఇందులో అనేక హోదాల్లో కొనసాగుతున్న వారు ఉన్నారు. జాబితా లో మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌వీఎ్‌స రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(వైటీడీఏ) వైస్‌ చైర్మన్‌ జి.కిషన్‌రావు, కన్సల్టెంట్‌ ఇంజినీరు బీఎల్‌ఎన్‌ రెడ్డి.. పది మంది ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెలాఖరుకల్లా అందరినీ తొలగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. ఈ జాబితాతో ఉన్న వారి సేవలు అవసరమని గుర్తిస్తే వారిని తిరిగి నియమించుకోవటానికి వీలుగా మరో నోటిఫికేషన్ జారీ
చేయాలని సూచించారు.

tg-govt-terminates-6-729-retired-and-contract-employees-from-the-services

ముఖ్య అధికారుల తొలిగింపు
ప్రభుత్వ నిర్ణయం మేరకు మున్సిపల్ శాఖలో కొనసాగుతున్న 177 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని తక్షణమే తొలగిస్తున్నట్లు ఆ ఉత్తర్వు ల్లో స్పష్టం చేశారు. ఈ జాబితాలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ వాటర్‌వర్క్స్‌, మెట్రో రైల్‌, రెరా, మెప్మా, కుడా, వైటీడీఏ.. ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న విశ్రాంత ఐఏఎస్ లు, ఆర్డీవోలు, డీఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్‌ ఆఫీసర్ల తో పాటుగా పలు క్యాడర్ల కు చెందిన అధికారులున్నారు. విద్యుత్తు శాఖలో మరికొందరు డైరెక్టర్లను కూడా తొలగించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక, ఇరిగేషన్ లో ఇప్పటికే 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం బయటకు వచ్చాక.. పోలీసు శాఖలోనూ పలువురిని తప్పించారు. ఇక, ఇప్పుడు మరికొందరి పైన నిర్ణయానికి రంగం సిద్దమైంది.

Take a Poll

ప్రభుత్వ నిర్ణయంతో
ప్రభుత్వ నిర్ణయంతో కీలక శాఖలుగా ఉన్న రెవెన్యూ, దేవాదాయం, ఆర్‌అండ్‌బీ, విద్యాశాఖ, బీసీ సంక్షేమం, రవాణా, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు ఇలా పలు కీలక శాఖల ముఖ్య అధికారులు సైతం శాఖల వారీగా ఉత్తర్వులు జారీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కాగా, తెలిగించిన వారిలో తిరిగి సేవలు అవసరమని భావిస్తే నోటిఫికేషన్ ద్వారా నియామాలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. మెట్రో రైల్‌ ప్రాజెక్టును ముందు నుంచి పర్యవేక్షిస్తున్న ఎన్‌వీఎస్‌ రెడ్డికి తిరిగి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా కొత్తగా నియామకాలను అవకాశం ఏర్ప తుందని అంచనా వేస్తున్నారు. గ్రూపు -1 నుంచి గ్రూపు-4 వరకు కొత్త నోటిఫికేషన్ల ద్వారా కొత్త వారికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ఉద్యోగుల ప్రమోషన్లకు అవకాశం ఏర్పడుతుంది అనే చర్చ సాగుతోంది. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+