సీఎస్ రామకృష్ణారావు పదవీ విరమణ వేళ బిగ్ ట్విస్ట్, ఇక నెక్స్ట్..!!
తెలంగాణకు కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు. కొద్ది రోజులుగా అధికారిక వర్గాల్లో ఈ చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం సీఎస్ గా ఉన్న రామకృష్ణారావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. దీంతో.. ఆయన స్థానంలో ఇద్దరు సీనియర్ అధికారుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారింది. ఈ సమయంలోనే అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంతో, ఇప్పుడు తదుపరి నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీ కాలాన్ని పొడిగించడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పదవీ కాలాన్ని పొడిగించాలంటూ కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాలశాఖ (డీఓపీటీ)కి లేఖ రాసినట్లు తెలుస్తోంది. రామకృష్ణారావు ఐఏఎస్ అధికారిగా ఈ నెల 31న పదవీ విరమణ చేయబోతున్నారు. అదే రోజు సీఎస్ గా ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఆయన రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నాలుగు నెలల పాటే ఆయన ఈ పదవిలో కొనసాగారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నాలుగు నెలలే ఉండటంతో.. ప్రభుత్వం మరో మూడు నెలల పాటు ఆయనకు పొడిగింపు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర డీఓపీటీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా రామకృష్ణారావు పదవీ విరమణ చేస్తే ఆయన స్థానంలో ఇద్దరు అధికారుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు గా ఉన్న జయేశ్ రంజన్, వికాస్ రాజ్ పోటీలో నిలిచారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం సీఎస్ గా రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగించాలని నిర్ణయించటంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాటయంతో డీఓపీటీ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఆ తరువాత సీఎస్ గా రామకృష్ణారావు కొనసాగుతారా.. మార్పు జరుగుతుందా అనేది స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications