ఇండిగో ఎఫెక్ట్: చెన్నై, బెంగళూరు, విశాఖకు RTC స్లీపర్ బస్సులు- ఛార్జీలు..!!
ఇండిగో విమానాల రద్దుతో ఆర్టీసీ రంగంలోకి దిగింది. దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి ఈ ఒక్క రోజే 49 విమానాలు రద్దు చేసినట్లు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించారు. పలువురు ప్రయాణీకులు విమానాశ్రయంలోనే ఇబ్బందులు పడుతున్నారు. అటు కేంద్రం జోక్యం చేసుకుంది. ఇదే సమయంలో రైల్వే ప్రత్యేక కోచ్ లు ఏర్పాటు చేసింది. కాగా, ఆర్టీసీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి పలు ప్రాంతాలకు తక్కువ ధర లకే స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసింది.
ఇండిగో విమానాల సంక్షోభం కొనసాగుతోంది. ఈ పరిణామాల పైన కేంద్రం సీరియస్ అయింది. ప్రయాణీకులకు పూర్తి రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఈ రాత్రి 8 గంటల వరకు సమయంగా నిర్దేశించింది. అటు రైల్వే కూడా ప్రయాణికులు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్య నగరాల మధ్య నడిచే 37 ప్రీమియం రైళ్లలో 116 బోగీలను అదనంగా జత చేసింది. ఇండిగో సమస్యతో ఇతర విమానయాన సంస్థలు టికెట్ ధరలను భారీగా పెంచాయి. దీంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలోనే తెలంగాణ ఆర్టీసీ శంషాబాద్ నుంచి ప్రత్యేకంగా స్లీపర్ బస్సులను నడుపుతోంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న బెంగళూరు, చెన్నై, విశాఖ, రాజమండ్రికి ఈ బస్సులను ఖరారు చేసింది. వీటి ధరలను వెల్లడించింది.

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు, చెన్నైకు ప్రత్యేకంగా స్లీపర్ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ఆర్టీసీ స్లీపర్ బస్సులు.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నుంచి బయల్దేరనున్నాయి. నుంచి శంషాబాద్ విమానాశ్రయం అరైవల్ ర్యాంప్ - పిల్లర్ నంబర్ 08 దగ్గర నుంచి 2 స్లీపర్ బస్సులు నడపనుంది. చెన్నై, బెంగళూరుకు ఒకటి చొప్పున బస్సులు బయలు దేరనున్నాయి. చెన్నై వెళ్లడానికి ఒక వ్యక్తికి టికెట్ ధర రూ. 2110, బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ. 1670 గా ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. వీటితో పాటు విశాఖ, కాకినాడ, రాజమండ్రి వరకు అదనపు బస్సులు జోన్ డీ నుంచి నడవనున్నాయి. ఇండిగో విమానాల రద్దుతో విమానాశ్రయం వద్దే ప్రయాణీకుల కోసం ఈ బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితికి అనుగుణంగా ఏ ప్రాంతాలకు డిమాండ్ ఉంటే.. అక్కడకు వెంటనే బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.












Click it and Unblock the Notifications