వినాయక చవితికి ప్రయాణికులకు ఆర్టీసీ షాక్.. చార్జీల బాదుడుపై ప్రయాణికులు ఫైర్!
వినాయక చవితి పండుగతో పాటు వీకెండ్ కూడా రావటంతో అందరూ తమ సొంత ఊళ్లకు వెళ్ళటానికి బస్టాండ్ ల బాట పట్టారు. వినాయక చవితి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ భారీగా బాదుడుకు తెరతీసింది. ఏకంగా 40 శాతం అదనపు భారం మోపింది.
హైదరాబాద్ నుంచి హన్మకొండకు వెళ్లే ఏసీ బస్సు టికెట్ సాధారణంగా రూ.420 ఉంటుంది అయితే పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో అదే ప్రయాణానికి రూ.570 వసూలు చేస్తోంది ఆర్టీసీ. పండుగకు ఊరికి వెళ్లాలనుకునేవారికి ఆర్టీసీ ఈ చార్జీలతో అదనపు భారం మోపింది. ఇది సామాన్య , మధ్యతరగతి ప్రజలకు ఊహించని ఆర్ధిక భారం అని చెప్పొచ్చు. అంతేకాదు రాజధాని బస్సులలో రిజర్వేషన్ చ చేసుకున్న వారు సైతం బస్సుల్లో ఎక్కే పరిస్థితి ఉండటం లేదు.

ఒక్కోసారి రిజర్వేషన్ చేసుకుని కూడా సూపర్ లగ్జరీ, ఎక్స్ ప్రెస్ వంటి బస్సులలో ప్రయాణం చెయ్యాల్సి వస్తుంది. . ఒక్క టికెట్‌పై ఏకంగా రూ.150 అదనపు భారం మోపటంపై సాధారణ మధ్యతరగతి ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థపైన అసహనంతో ఉన్నారు, పండుగలు వస్తే చాలు ఈ తరహా చర్యలతో ఆర్టీసీ సామాన్యుల జేబులు గుల్ల చేస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వినాయక చవితి సందర్భంగా పెరిగిన టికెట్ ధర దాదాపు 39 నుంచి 40 శాతంగా ఉందని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అంటున్నారు ప్రయాణికులు.ప్రతి పండుగ సమయంలోనూ ఇలా రద్దీని ఆసరాగా తీసుకుని ఆర్టీసీ ఛార్జీలను పెంచడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పండుగల సమయంలో ప్రయాణికులకు ఉపశమనం కల్పించాల్సిన బదులు ఛార్జీలు పెంచడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.
అలాగే రాయితీ బస్ పాస్ లు పండుగ సమయాల్లో చెల్లుబాటు కావని చెప్పటంతో ఆయా పాస్ లు ఉన్నవారు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీజీఎస్‌ఆర్టీసీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని, పండుగ సందర్భంగా అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. రద్దీ సమయంలోనూ సాధారణ ధరల్లోనే టికెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
