టీజీఎస్ఆర్టీసీకి 21 కోట్ల టోకరా, గో రూరల్ ఇండియా ఆస్తుల జప్తు
ప్రకటనల పేరుతో మోసానికి పాల్పడిన గో రూరల్ ఇండియా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అటాచ్ చేశారు. ఆ సంస్థకు చెందిన రూ 6.47 కోట్ల విలువైన స్థిరాస్థులను తాత్కాలికంగా జప్తు చేశారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ప్రకటనల ప్రదర్శనకు గో రూరల్ ఇండియా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే, ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా M/s GRIPL, M/s Poster town india pvt ltd, M/s Go transit media pvt ltd, M/s lime lite advetising pvt ltd వంటి అనుబంధ కంపెనీల ద్వారా గో రూరల్ ఇండియా నిర్వాహకులు వ్యాపారం చేశారని ఈడీ అధికారులు గుర్తించారు.

కస్టమర్ల నుంచి వచ్చిన కోట్లాది రూపాయలు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించారని ఈడీ దర్యాప్తులో తేలింది. తెలంగాణ ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ. 21.72 కోట్ల బకాయిని చెల్లించకుండా ఆ డబ్బును వివిధ పెట్టుబడులకు ఉపయోగించారని ఈడీ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.
రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీపీవో
భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పుల్లురు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ నుంచి లంచం వసూలు చేసేందుకు డీపీవో శ్యామ్ సుందర్ సిద్ధమయ్యాడు. వెంచర్ మేనేజర్ నుంచి రూ. 2 లక్షల లంచం తీసుకోవాలంటూ పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి సూచించాడు.
వెంచర్ మేనేజర్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో పంచాయతీ సెక్రటరీ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. డీపీవో సూచన మేరకే తాను రూ. 2 లక్షలు తీసుకున్నట్లు పేర్కొన్నాడు పంచాయతీ సెక్రటరీ. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. డీపీవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టారు.












Click it and Unblock the Notifications