TGSRTC: పురుషులకు టీజీఎస్ఆర్టీసీ షాక్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పురుష ప్రయాణికులకు షాకిచ్చింది. టీజీఎస్ఆర్టీసీ మరోసారి ఛార్జీలు పెంచింది. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్‌గేట్ల వద్ద ఈ ఫీజులు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ టికెట్ చార్జీలు చార్జీలు పెరిగాయి. టోల్ ప్లాజాలు ఉన్న రూట్లలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో రూ.3 పెంచారు.
టోల్ గేట్లతో రోడ్లపై తిరిగే ఆర్టీసీ బస్సులు కూడా టోల్ రుసుము చెల్లించాలి. టోల్ గేట్ ఛార్జీలు పెరగడంతో ప్రయాణికులపై ఆర్టీసీ భారం మోపింది. టికెట్ ఛార్జీల్లో చేర్చిన టోల్ ఫీజును రూ.3 పెంచింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10 నుంచి రూ.13, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో రూ.13 నుంచి రూ.16, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17. నాన్-ఎసి స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ బస్సులలో 15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.20 నుంచి రూ.23కి.పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి.

ఒక్కో టోల్ గేట్‌కు రూ. 3 పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నిత్యం 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని.. ఇందులో నగరంలో 12 లక్షల మంది, పల్లె వెలుగు బస్సుల్లో 12 లక్షల మంది ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. ఛార్జీల పెంపు భారం తమకు వర్తించదని, మిగిలిన 6 లక్షల మందికి మాత్రమే అదనపు భారం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఛార్జీలు పెంచిన టోల్ గేట్ల వద్ద టోల్ చెల్లించడంతో ఆర్టీసీకి అదనపు ఆదాయం వస్తుందని తెలుస్తోంది.
అయితే ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఛార్జీల పెంపుపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే, వారిపై ఎలాంటి భారం పడే అవకాశం లేదు. ఇప్పుడు ఆ భారాన్ని పురుషులు మాత్రమే భరించాల్సి ఉండటం గమనార్హం.
కాగా, ఆర్టీసీ ఎలాంటి ఛార్జీలు పెంచలేదని.. టోల్ గేట్లు లేని ప్రాంతాల్లో పాత ఛార్జీలనే వసూలు చేస్తారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. టోల్ గేట్ల మార్గాల్లోనే టోల్ ఛార్జీలు పెరిగిన మొత్తాన్ని మాత్రమే అదనంగా ఛార్జీ చేస్తారని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications