TGSRTC ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఇక, వర్తింపు ఇలా - ఆదివారం వీరికీ ఫ్రీ జర్నీ..!!

TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళలకు పలు కేటగిరీ బస్సుల్లో మహాలక్ష్మీ పథకం కింద ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తున్నారు. ఇప్పుడు నెల వారీ సీజన్ టికెట్ విధానం అమలులో ప్రత్యేకరాయితీలను ప్రకటించింది. దీని ద్వారా మహిళలతో పాటుగా పురుష ప్రయాణీకులకు ప్రయోజనం కలగనుంది. కొత్త విధానం ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. కొత్తగా ప్రవేశ పట్టిన రాయితీలు... మినహాయింపుల పైన ఆర్టీసీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించారు.

తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. నెలలవారీ సీజన్ టికెట్ లో ప్రత్యేక రాయితీలను అమలు చేయాలని నిర్ణయించింది. మహిళా ప్రయాణికులలో సీజన్‌ టికెట్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వారికి సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోను అలాగే జిల్లాల్లో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అయితే మెట్రో, రాజధాని, డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించేందుకు మహిళలు టిక్కెట్‌, నెలవారీ పాస్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీరి కోసం ప్రత్యేక రాయితీ ప్రవేశపెట్టింది. ఇకపై వారు ఈ బస్సుల్లో నెలవారీ రూట్‌ పాస్‌ కోసం 15 రోజులకు చెల్లిస్తే సరిపోతుంది. పాస్‌ కోసం ప్రస్తుతం చెల్లిస్తున్న రుసుములో సగం ధరకే ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పాస్‌ ధరలను మరింత తగ్గించే క్రమంలో టోల్‌ ప్లాజా చార్జీలను ప్రస్తుతం ఉన్న 25 రోజులకు బదులు గా ఇకపై 20 రోజులకు మాత్రమే లెక్కించనున్నారు. అదే విధంగా సాధారణ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ ఎంపికను అందించేందుకు డీలక్స్‌ నెలవారీ సీజన్‌ టికెట్లను ఆర్టీసీ ప్రవేశపెడుతోంది.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన - టికెట్లు జారీ ఇలా..!!
tgsrtc-introduces-special-discount-for-women-on-season-tickets-in-ac-buses-details-here

కాగా.. ఈ పాస్‌లు 'ఇ-డీలక్స్‌' సర్వీసులలో సైతం చెల్లుబాటవుతాయి. ఇక హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ, నిజామాబాద్‌ నగరాల్లో నెలవారీ సిటీ పాస్‌ కలిగిన వారికి ప్రత్యేక ప్రయోజనంగా.. అన్ని కేటగిరీల సిటీ బస్సు సర్వీసుల లో ఆదివారాల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పించారు. కాగా.. ఈ సౌకర్యం గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని పుష్పక్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసులకు, ఇతర ప్రభుత్వ సెలవు దినాలకు వర్తించదు. ప్రయాణికులకు మరింత సౌలభ్యం కోసం 'కాంబి టికెట్‌'ను అందుబాటులోకి తెచ్చింది. దీని కింద ప్రతి ప్రయాణానికి అదనంగా రూ. 20 చెల్లించి కాంబి టికెట్‌ తీసుకోవడం వల్ల.. పల్లెవెలుగు నెలవారీ సీజన్‌ టికెట్‌ హోల్డర్స్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇ-ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ, అలాగే ఎక్స్‌ప్రెస్‌ ఎంఎస్టీ హోల్డర్లు డీలక్స్‌, ఈ-డీలక్స్‌ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. కాగా 2 నెలల సీజన్‌ టికెట్‌ తీసుకునే వారికి అదనంగా 5 రోజుల వ్యాలిడిటీ, 3 నెలల కోసం తీసుకునే వారికి అదనంగా 10 రోజుల వ్యాలిడిటీని కల్పిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+