కార్తీకమాసంలో ఆర్టీసీ స్పెషల్‌ ఆఫర్.. మీ కాలనీల నుండే పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

కార్తీక మాసం వచ్చేసింది. శివభక్తులకు ఇది అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో సోమవారాల్లో శివాలయాలకు వెళ్లి అభిషేకాలు చేయడం, దీపాలు వెలిగించడం, ఉపవాసాలు ఉండటం వంటి సంప్రదాయాలు ఇప్పటికీ ఎంతో గొప్పగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభ వార్త చెప్పింది.

నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నుంచే ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రా బస్సులు నడుపుతారు. ఇంటి దగ్గర నుంచే బస్సు వస్తే ప్రయాణ ఇబ్బంది తగ్గుతుంది. ఒక్కో బస్సులో 40 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబాలు, మిత్రబృందాలు కలిసి సౌకర్యవంతంగా యాత్ర చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

TGSRTC Special Pilgrimage Buses for Karthika Masam - Direct Services from Hyderabad Colonies to Holy Temples

ఆర్టీసీ కేవలం ఒకటి రెండు క్షేత్రాలకే కాకుండా పలు సర్క్యూట్‌లను రూపొందించింది. కరీంనగర్ సర్క్యూట్‌లో వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కొమురవెల్లి మల్లన్న, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. వరంగల్ సర్క్యూట్‌లో కాళేశ్వరం, వేయిస్తంభాల గుడి, రామప్ప, ఐనవోలు మల్లికార్జునస్వామి, లక్నవరం వంటి ప్రాంతాలు ఉన్నాయి. శ్రీశైలం సర్క్యూట్‌లో శ్రీశైలం మల్లికార్జునస్వామి, ఉమామహేశ్వరం, సోమశిల, కందూరు, జోగులాంబ గద్వాల క్షేత్రాలు ఉన్నాయి.

పంచారామాల యాత్రకు కూడా ప్రత్యేక ఏర్పాటు ఉంది. అన్నవరం, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి - ఈ ఆరు పంచారామాలను ఒకే ప్యాకేజీలో చూడవచ్చు. అంతేకాదు, తమిళనాడులోని అరుణాచలం తిరువణ్ణామలై క్షేత్రానికి, కర్ణాటకలోని హంపి, మురుడేశ్వర్‌కు కూడా బస్సులు నడుపుతారు. కీసరగుట్ట, అనంతగిరి హిల్స్, ముచ్చింతల, యాదాద్రి, సోమశిల వంటి సమీప క్షేత్రాలకు కూడా సౌకర్యం ఉంటుంది.

కార్తిక మాసంలో సోమవారాలు ప్రత్యేకం. శైవక్షేత్రాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆర్టీసీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్యను పెంచుతోంది. ఒకే యాత్రలో పలు ఆలయాలు చూడాలనుకునే భక్తులకు ఈ సర్క్యూట్‌లు చాలా ఉపయోగపడతాయి. టైం, డబ్బు రెండూ ఆదా అవుతాయి.బుకింగ్ కోసం సంబంధిత డివిజన్‌లను సంప్రదించవచ్చు. కూకట్‌పల్లి డివిజన్ - 9959226148, సికింద్రాబాద్ - 9959226142, హయత్‌నగర్ - 9959226136, చార్మినార్ - 9959226129, జూబ్లీ బస్‌స్టేషన్ (జేబీఎస్) - 9959226160.

మీ ప్రాంతం ఏ డివిజన్‌ కింద ఉందో తెలుసుకుని ముందుగానే సమాచారం సేకరించుకోవడం మంచిది. ప్యాకేజీ వివరాలు, ధరలు, బస్సు నంబర్లు అన్నీ అక్కడే తెలుస్తాయి.కార్తిక మాసంలో పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యం అని పెద్దలు చెబుతారు. ప్రత్యేకంగా శివుని ఆలయాల్లో దీపారాధన, అభిషేకాలు చేస్తే కోరికలు నెరవేరతాయని నమ్మకం. ఆర్టీసీ ఈ సౌకర్యం కల్పించడం వల్ల సాధారణ భక్తులు కూడా సులభంగా యాత్ర చేయగలుగుతున్నారు.

పేదలకు దీపావళి కానుక ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. నేటి నుంచి కొత్త పింఛన్ల పంపిణీ
పేదలకు దీపావళి కానుక ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. నేటి నుంచి కొత్త పింఛన్ల పంపిణీ

ఇంటి నుంచి బయలుదేరి మళ్లీ ఇంటికే తిరిగి రావడం సులభం కాబట్టి ముఖ్యంగా వయోవృద్ధులు, మహిళలు, పిల్లలు ఉన్న కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరం.భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కార్తీక మాస యాత్రలు చేయాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+