Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దటీజ్ రేవంత్ రెడ్డి.. ఆ వీడియోతో నెటిజన్లు ఫిదా!!

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండే తన మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. తాము పాలకులం కాదు సేవకులం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ మాట మేరకు ఇప్పటివరకు ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని, వారికి సహాయం అందిస్తున్నారు. అయితే తాజాగా ఒక సంఘటన రేవంత్ రెడ్డి నాయకత్వానికి అద్దం పడుతుంది.

రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించటం కోసం యశోదా ఆస్పత్రికి వెళ్ళిన సమయంలో జరిగిన ఒక సంఘటన దటీజ్ రేవంత్ రెడ్డి అని అందరూ అనుకునేలా చేస్తుంది. దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సహజంగా సీఎం ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే అధికారులు ఆయనకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

That is Revanth Reddy.. netizens praising CM revanth reddy with this viral video

ముఖ్యంగా సీఎం ను ఆ సమయంలో ఎవరినీ కలవకుండా చర్యలు తీసుకుంటారు. అయితే నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించి వెళ్తున్న క్రమంలో రేవంతన్నా అంటూ ఒక గొంతు వినిపించటంతో రేవంత్ రెడ్డి టక్కున ఆ గొంతు వినిపించిన దిశగా వెళ్ళారు. అక్కడ ఒక యువతి తన తండ్రి ఆస్పత్రిలో ఉన్నారని, ఆయనకు ఆస్పత్రి వైద్యులు ఒక్కరోజుకు లక్షన్నర బిల్లు వేశారని, తమకు సహాయం చెయ్యాలని కోరారు.

దీంతో స్పందించిన రేవంత్ రెడ్డి ఆ యువతితో మాట్లాడారు. బాధపడకు తల్లీ..ధైర్యంగా ఉండు అని ఆమెకు భరోసా ఇచ్చారు. అధికారులను ఆ యువతి సమస్య తెలుసుకుని సహాయం చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా దటీజ్ రేవంత్ రెడ్డి అని కొనియాడుతున్నారు.

రేవంతన్నా అంటే మీ వెంట నేనుంటా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు అని నెటిజన్లు రేవంత్ రెడ్డికి కితాబిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రానికి సీఎం అయినప్పటికీ సామాన్యులకు మాత్రం రేవంతన్నే అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+