వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోర్డ్ అదికారులపై చర్యలు..!చనిపోయిన కుటుంబాల బాద్యత ప్రభుత్వానిదే అన్న కాంగ్రెస్ నేతలు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ఇంటర్ బోర్డ్ తప్పిదాలపై ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా జరిగిన సంఘటన పట్ల దిద్దుబాటు చర్యలు చేపట్టి విద్యార్థుల భవితను కాపాడలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాలు చేసినందుకుగాను బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయం ఎదుట ఆయన ధర్నా చేపట్టారు. విద్యార్థులందరికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ ఫలితాల తప్పిదాలపై సీఎం చంద్రశేఖర్ రావు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. రీ కౌంటింగ్‌, రీ వాల్యూవేషన్‌కు కూడా అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఫలితాల తప్పిదాలనకు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

The action should taken..!govt should take responsibility of dead student families.!

తెలంగాణ ఇంటర్‌ బోర్డు వైఫల్యాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ వివాదంపై స్పందించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్య సమాధానాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జోక్యం చేసుకుని సాద్యమైనంత త్వరగా ఈ సమస్యకి పరిష్కారం చూపాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. వైఫల్యానికి బాధ్యులైన అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చనిపోయిన ప్రతి విద్యార్థి కుంటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.

English summary
Congress Working President Revanth Reddy demanded action against board officials for making mistakes in the inter results. He took up the dharna before the Telangana Inter-board office. Jaggareddy demanded that Chief Minister Chandrasekhar Rao intervene and resolve the issue as soon as possible. Urged immediate action against officials responsible for the failure. Jaggareddy demanded a financial aid of Rs 25 lakh for each student who died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X