మృగశిర కార్తె ప్రారంభం!చేపలు తినడం ఆనవాయితీ!దీని వెనుక ఆశ్చర్యపోయే ఆరోగ్య రహస్యాలు ఇవే!

హైదరాబాద్ : బుదవారం జూన్‌ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం అయ్యింది. ఈ మృగశిర కార్తెకు ఓ విశిష్టమైన ప్రత్యేకత ఉంది. మృగశిర రోజు ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక గొప్ప ఆరోగ్య రహస్యం దాగివుంది.రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణి కార్తె ముగిసి, చల్ల బరిచే మృగశిర మొదలవుతుంది. మృగశిర కార్తె అంటే, అశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష సాంప్రదాయం ప్రకారం, ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటినుంచి నైరుతి రుతుపనాలు విస్తరిస్తాయి.

 మృగశిర కార్తెతో వాతావరణంలో మార్పులు.. రోగ నిరోధకశక్తని చేపలు పెంచుతాయి

మృగశిర కార్తెతో వాతావరణంలో మార్పులు.. రోగ నిరోధకశక్తని చేపలు పెంచుతాయి

వాతావరణం ఒక్కసారి చల్లబడటంతో పాటు ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మీక్రిములు పునరుత్పత్తి అవుతాయి. మానవునిలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి.మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా, మధుమోహ వ్యాధి ఉన్న వారు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. అంతే కాకుండా గుండెజబ్బులు, ఆస్తమా తదితర ఆనారోగ్యసమస్యలన్నింటికి అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాల్సిందే.

 చేపలలో విలువైన పోషకాలు.. పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు.

చేపలలో విలువైన పోషకాలు.. పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు.


చేపలలో పోషకాలు అంతా ఇంతా కాదు. చేపలలో ఎన్నో పోషకాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. చేపలలో అనేకమైన మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. చేపలు కొవ్వులు చాలా సులభంగా జీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు. చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనంపై మంచి ప్రభావం చూపుతాయి.
ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.

 కొర్రమీనులో ఆరాఖిడోనిక్‌ ఆమ్లం. గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం..

కొర్రమీనులో ఆరాఖిడోనిక్‌ ఆమ్లం. గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం..


చేపల్లో బీ12 విటమిన్‌, రైబోప్లవిన్‌, నియాసిన్‌, బయెటిక్‌, థయామిన్‌ తదితర విటమిన్లు లభిస్తాయి. సముద్ర చేపల కాలేయంలో విటమిన్‌ఏ,డీ, ఈ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. చేపలు గుండెకు సంబంధిత వ్యాధులకు, ఆస్తమా, షూగర్‌ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పని చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులు, పిల్లల తల్లులకు ఎంతో మేలు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థ అభివృద్ధి చేస్తాయి చేపలు. మన రాష్ట్ర చేపల్లో కొర్రమీనులో లభించే ఆరాఖిడోనిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం ఉంటుంది.

 మృగశిర కార్తె రోజు చేపలను ఏ రూపంలో తినొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు

మృగశిర కార్తె రోజు చేపలను ఏ రూపంలో తినొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు


దేశీయ మార్పు చేపల్లో ఐరన్‌, కాపర్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున స్థానికంగా దొరికే పెద్ద చేపలను ఇంగువ, చింత చిగురుతో కలిపి వండుకుని తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా, మధుమోహ వ్యాధితో బాధపడుతున్న వారు చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+