Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రం పెత్తనాన్ని అడ్డుకుంటాం! చంద్రబాబుతో మాట్లాడతానంటూ రేవంత్

రాష్ట్రాల పరిధిలో ఉండే విశ్వవిద్యాలయపై పెత్తనం చెలాయించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను చూస్తు ఊరుకోబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో మాట్లాడాలని భావిస్తున్నట్టు చెప్పారు. 32 ఏళ్ల తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం గమనార్హం.

యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడంతో పాటు కొత్తగా నిర్మించనున్న మూడు భవనాలకు శంఖుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. యూజీసీ ముసుగులో వర్సిటీలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్రాల వర్సిటీలపై ఆధిపత్యం చెలాయించాలని చూడటం సాంస్కృతిక దాడిగా అభివర్ణించారు. ఈ విషయంలో మేధావులందరూ ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు.

The Centre is dominating the states under the guise of UGC CM Revanth Reddy

కేంద్రం, రాష్ట్రాల అధికారాల విషయంలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నప్పటికీ దాని స్ఫూర్తికి విరుద్ధంగా చేసే ప్రయత్నాలపై సమిష్టిగా కోట్లాడుతామని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కుట్రను మాపై దాడిగానే భావిస్తాం. ఆ ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా చేస్తూపోతే చివరకు స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ లు కేవలం పన్నులు వసూలు చేసుకునే సంస్థలుగా మిగిలిపోతాయన్నారు సీఎం రేవంత్.

తెలంగాణ రాష్ట్రంలో కొన్నేళ్లుగా విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యానికి గురయ్యాయి. ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మరుక్షణం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చానో ఎలాంటి వివాదాలకు తావులేకుండా విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చామని సీఎం రేవంత్ వివరించారు.

The Centre is dominating the states under the guise of UGC CM Revanth Reddy

వర్సిటీ వీసీల నియామకంలో సామాజిక న్యాయం అనే కోణానికి కూడా ప్రాధాన్యతనిచ్చాం. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీకి దాని చరిత్రలో ఏ రోజూ ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వైస్ ఛాన్సలర్ గా నియమించబడలేదు. ఆ సామాజిక వర్గం నుంచి విద్యావేత్తను వీసీగా నియమించామన్నారు సీఎం రేవంత్.

విశ్వవిద్యాలయాలను పునర్నిర్మాణం జరగాలి. మన కళ్ళ ముందే వాటి ప్రతిష్ట దిగజారుతుంటే చూస్తూ ఊరుకుంటే మనం ఈ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరాలు తెప్పించుకుని సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు.

అనుభవం కలిగిన అధ్యాపకుల సేవలను వినియోగించుకోవాలన్న ఆలోచన చేస్తున్నాం. వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలన్న ఆలోచన ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి, వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణితో పాటు ప్రొఫెసర్లు, మేధావులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+