చనిపోయిన తండ్రి గురించి చెప్తూ ఏడ్చిన చిన్నారి.. హరీశ్ రావు కంటతడి
తన తండ్రి చనిపోయారంటూ ఓ చిన్నారి ఏడ్చుకుంటూ మాట్లాడటంతో అక్కడేవున్న మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. సిద్దిపేటలోని మెట్రో గార్డెన్స్‌లో 'భద్రంగా ఉండాలి - భవిష్యత్‌లో ఎదగాలి' పేరిట పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించగా.. వారు తమ తల్లిదండ్రుల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మాట్లాడుతూ.. నా పేరు సాత్విక.. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. నేను సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. అప్పట్నుంచి మా అమ్మే నన్ను మంచిగా చూసుకుంటుంది. కానీ, నేనే ఊరికే తిడుతుండేదాన్ని. నేను ఇప్పట్నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీసుకువస్తాను. ధన్యవాదాలు అంటూ ఆ చిన్నారి కన్నీటిపర్యంతమైంది.

ఆ చిన్నారి చెప్పిన మాటలకు హరీశ్ రావు కూడా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. సాత్వికను దగ్గరకు చేరదీసి ఏడవద్దని చెప్పారు. తన పక్కనే కూర్చొపెట్టుకుని ఆ చిన్నారిని హరీశ్ రావు ఓదార్చారు. అనంతరం హరీశ్ రావు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.
తండ్రి చనిపోయినా కష్టపడి చదువుతున్న చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2025
తండ్రి చనిపోయాడని.. తన తల్లి కష్టపడి చదివిస్తుందన్న ఓ చిన్నారి కథ విని స్టేజి పైనే కంటతడి పెట్టుకుని.. చిన్నారిని ఓదార్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్… pic.twitter.com/49x2DokEC4
అమ్మనాన్నల గౌరవాన్ని తమకు అర్థమయ్యేలా చెప్పి, వాళ్ల విలువ తెలిపేటట్టు చెప్పి.. మనందరికి కళ్లు తెరిపించిన పిల్లలను చప్పట్లతో అభినందించాలన్నారు. ఈ పిల్లల బాధలు విని ప్రతి ఒక్కరూ రియలైజ్ కావాలన్నారు. జీవితాంతం తల్లిదండ్రులు, టీచర్లను గౌరవించాలన్నారు. అమ్మ కంటే మంచి కోరుకునేవారు ఈ భూమ్మీద ఎవరూ ఉండరని హరీశ్ రావు చెప్పారు. ఫోన్లు చూస్తూ టైమ్ వేస్త్ చేయొద్దన్నారు. అమ్మ మాట వినండి.. గౌరవించండి.. ఇవాళ్టి నుంచి మీ అందరిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు.












Click it and Unblock the Notifications