10వ తరగతి పరీక్షలు తేదీలు ఇవే: ఏప్రిల్ 3 నుంచి..!!

హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్పులు చేసిన విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనుంది ప్రభుత్వం. వచ్చే సంవత్సరం వార్షిక పరీక్షలను కొత్త విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థులకు ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి ఈ పరీక్షల్లో. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ఈ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.

పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వాన్ని ప్రదర్శించకూడదని అన్నారు. పరీక్షల కోసం అన్ని స్థాయిల్లోనూ అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని ఆదేశించారు.

 The class 10 SSC Board examinations in Telangana will be held from April 3, 2023

2023 ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలను నిర్వహించేలా ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 3వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్, 4వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 6వ తేదీన థర్డ్ లాంగ్వేజ్ పరీక్షలు ఉంటాయి. 8వ తేదీన మేథమేటిక్స్, 10వ తేదీన సైన్స్, 11వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలను షెడ్యూల్ చేశారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్కో సబ్జెక్టులో పరీక్షలకు 80, ఫార్మెటివ్ అసెస్ మెంట్ కు 20 మార్కులు ఉంటాయని తెలిపారు. సైన్స్ పేపర్‌లో ఫిజిక్స్, బయోలజీకి చెరి సగం మార్కులను ఇచ్చేలా కొత్త విద్యా విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. అన్ని సబ్జెక్టులకు పరీక్ష సమయం 3 గంటలు ఉండగా.. సైన్స్ ‌కు అదనంగా 20 నిమిషాల పాటు సమయం కేటాయించినట్లు పేర్కొన్నారు.

మూడు గంటలకు బదులుగా 3:20 నిమిషాల పాటు సైన్స్ పరీక్ష సమయం ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే చదువులో వెనుకంజలో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తరగతులను నిర్వహించాలని అన్నారు. సబ్జెక్టుల వారీగా ఈ అదనపు క్లాసులను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంపై దృష్టి సారించాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+