ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రత : కరోనా వ్యాప్తి - రాత్రి వేళ అప్రమత్తం : ఇలా చేయండి..వైద్యుల సూచనలు...!!
తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సారిగా వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆగ్నేయ భారతదేశం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండడంతో పాటు, వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కొన్నిచోట్ల గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్రంలో గరిష్టంగా ఖమ్మంలో 31.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్‌లో కనిష్టంగా 11.2 డిగ్రీలు నమోదయ్యింది. చాలాచోట్ల సాధారణం కంటే 3.65 డిగ్రీల మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

చలి పెరుగుతోంది..అప్రమత్తత అవసరం
వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తి గతం కంటే గణనీయంగా తగ్గింది. కానీ, ఇంకా పూర్తిగా ముప్పు మాత్రం తొలిగిపోలేదు. దీంతో..ఈ చలి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా..ఈ చలి కారణంగా శరీర ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతాయి. ఆ సమయంలో శరీరంలో ఎక్కు వ భాగం కవర్ అయ్యే విధంగా దుస్తులు ధరించాల్సిన అవసరం ఉంది.

కరోనా ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు
చలి సమయంలో వీలైనంత వరకు బయట తిరగకుండా పనులు త్వరగా ముగించుకుని ఇంటికి చేరుకోవాలి. చలికాలంలో రాత్రి వేళ గుండెపోటులు ఎక్కువగా నమోదవుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. మధ్యరాత్రి.. తెల్లవారుజాముల్లో హార్ట్ ఎటాక్‌కు ఆస్కారం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. చలికి రక్తనాళాల్లో ప్రసరణ తగ్గిపోవడం తో పాటుగా రక్తం గడ్డకట్టడంతో ఈ పరిస్థితి తలెత్తుతుందని వివరిస్తున్నారు. హృద్రోగులు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవాళ్లు తప్పకుండా స్వెట్టర్స్ వేసుకుని ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఊపరితిత్తుల సమస్యల ఉన్నవారు మరింత జాగ్రత్తగా
ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చలిగాలుల ప్రభావంతో ఇలాంటి వాళ్లు త్వరగా అనారోగ్య సమస్యలకు గురి కావొచ్చని చెబుతున్నారు. అలాంటివాళ్లు ఇబ్బందులు తలెత్తితే వీలైనంత త్వరితంగా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని సూచిస్తున్నారు. చలికాలంలో కాలుష్య ప్రభావంతో పొగమంచుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మధ్యరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వాతావరణ పరిస్థితులను గమనించి ప్రయాణాలు సాగించడం మంచిదని..చలికాలంలో మితిమీరిన ఎక్సర్‌సైజులు చేయడం కూడా మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

వైద్యుల హెచ్చరికలు - సూచనలు
ప్రస్తుతం కోవిడ్-19 వ్యాప్తి కొనసాగుతున్నందున జలుబు, జ్వరం, దగ్గు వస్తే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలు తీవ్రమైతే కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలని..ఇదే సమయంలో పరీక్ష ఫలితం వచ్చే వరకు వేచిచూడకుండా వైద్యుల సూచనలతో తగిన విధంగా మందులు వాడాలని చెబుతున్నారు. స్వీట్లు, ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్‌ను వీలైనంత తగ్గించాలని... తాగునీరు కూడా చల్లగా కాకుండా గోరువెచ్చగా చేసి తాగితే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
Recommended Video

వేగంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు
దీర్ఘకాలిక సమస్యలున్న వాళ్లు సరైన సమయానికి మందులు వేసుకోవాలని.. వైద్యులు సూచించిన సమయాల్లో కాకుండా ఆలస్యంగా మందులు వేసుకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో వాతావారణ శాఖ అధికారులు సైతం గత రెండు,మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతున్నాయని వివరించారు. వాతావరణంలో మరో వారం రోజుల వరకు ఇలాగే మార్పులు నమోదవుతాయని స్పష్టం చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం అటుఇటుగా ఉన్నాయని వివరించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications