TGSRTC: శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. వారి కోసం రోడ్డెక్కనున్న ఆ బస్సులు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ ల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే సిటీ బస్సులో కూడా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం ఉంది. తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణ పథకం సక్సెఫుల్ గా కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త చెప్పింది.
ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు గరుడ ప్లస్ కేటగిరిలో పది ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ కేటగిరీలలో తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయని వెల్లడించింది.

నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్ట్ కింద టీజీఎస్ ఆర్టీసీకి 450 బస్సులు మంజూరయ్యాయి. ఈ 450ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రానికి రానున్నాయని పేర్కొంది. మరో వారం రోజుల తర్వాత దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయని తెలిపింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, సూర్యాపేట మధ్య కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ సిటీలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్న సంగతి తెలిసిందే.
పల్లెల్లో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు. pic.twitter.com/rTa7lz6NyL
— Telangana Congress (@INCTelangana) July 1, 2024
హైదరాబాద్ నగరంలో నడపిస్తున్న ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులకు టీజీఎస్ ఆర్టీసీ మంత్లీ బస్ పాసు ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ బస్‌పాస్ ధర రూ.2,530 ఉండగా.. ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో బస్ పాస్ కేవలం రూ.1900 తగ్గించింది.












Click it and Unblock the Notifications