Kavitha: ఎమ్మెల్సీ కవితకు గుడ్ న్యూస్.. దానికి అనుమతి ఇచ్చిన కోర్టు..
రౌస్ ఎవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు శుభవార్త చెప్పింది. కవిత ప్రస్తుతం లిక్కర్ కుంభకోణం కేసులో జైలులో ఉన్నారు. తీహార్ జైల్లో ఆభరణాలు ధరించేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు కవితకు అనుమతి ఇచ్చింది. సీబీఐ స్పెషల్ కోర్టు మొత్తం 9 పేజీలతో కూడిన కవిత రిమాండ్ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో కవిత చేసిన పలు విజ్ఞప్తులకు కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కవిత కోరిన కొన్ని కోరికలను కోర్టు అంగీకరించింది.
ఈ మేరకు రౌస్ ఎవెన్యూ సీబీఐ స్పెషల్ కోర్టు తీహార్ జైలు సూపరింటెండెంట్ కు ఉత్తర్వులు పంపించారు. కవితకు పడుకునేందుకు మంచం, ఇంటి భోజనం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే పెన్ను, పేపర్లు, మందులు తీసుకెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్యపరీక్షలకు సంబంధించిన రికార్డులను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది.

కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ ఒకటి నాటికి సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఖరారు చేస్తూ.. అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను సీల్డ్ కవర్ లో కవిత న్యాయవాదులకు ఇవ్వాలని సూచించింది. ఈ రికార్డులను 'కాన్ఫిడెన్షియల్'గానే ఉంచాలని కవిత న్యాయవాదులకు కోర్టు స్పష్టం చేసింది. కాగా మంగళవారం కవిత తీహార్ జైలుకు వెళ్తూ మాట్లాడారు.
కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. కాగా.. మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యారు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సంవత్సరానికి పైగా విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications