Yadadri: యాదాద్రిలో భక్తుల రద్దీ.. స్వామిదర్శనానికి 5 గంటల సమయం..
తొలి ఏకదాశి సందర్భంగా రాష్ట్రంలోని పలు దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. గురువారం సెలవు రోజు కావడంతో యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తొలి ఏకాదశి, స్వామివారి జన్మనక్షత్ర స్వాతి నక్షత్రం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుడి దర్శనానికి బారులు తీరారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లలో వేచి ఉన్నారు.
స్వామివారి ధర్మదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. స్వామివారి జన్మనక్షత్ర స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలతోపాటు అభిషేకాలు చేశారు. అటు వేములవాడ ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఉంది. రాజన్న దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.













Click it and Unblock the Notifications