Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. సీఎం రేవంత్ ఆసక్తికర పోస్టు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఏడాది కింద మార్పు కోసం కాంగ్రెస్‌పై విశ్వాసంతో అధికారాన్ని కట్టబెట్టిన అన్నదాతలతో కలిసి రైతు పండుగ చేసుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో రైతన్న బాగు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

రైతుల సంతోషంలో పాలు పంచుకోవడం కోసం ఉమ్మడి పాలమూరు సభలో పాల్గొంటానని సీఎం రేవంత్ తెలిపారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు... పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు... పోలింగ్ బూతుకు వెళ్లి "మార్పు" కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై...
రైతన్న చరిత్రను తిరగరాసింది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

The day people crowned the Congress party with their votes CM Revanth Reddy

ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ... రూ.7,625 కోట్ల రైతు భరోసా...
ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్... రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్... రూ.1433 కోట్ల రైతుబీమా... రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం...
రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామంటూ రేవంత్ రెడ్డి వివరించారు.

ఒక్క ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం. ఇది నెంబర్ కాదు... రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం.
ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

కాగా, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమ ముగింపునకు సీఎం రేవంత్‌ రెడ్డి శనివారం హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే అమిస్తాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 28 నుంచి 30వ తేది వరకూ రైతుపండగ వేడుకలని సర్కార్‌ నిర్వహిస్తోంది. ఆత్యాధునిక సాగుపద్ధతులు, లాభసాటి పంటలు వ్యవసాయ యాంత్రీకరణ, అధునిక పోకడలపై కర్షకులకు అవగాహన కల్పించేందుకు 150కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. మూడో రోజూ కార్యక్రమాలు కొనసాగనుండగా ఉమ్మడి జిల్లా సహా చుట్టుపక్కల జిల్లా నుంచి రైతులని తరలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+