• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈడీ సోదాలు - రాజకీయ కలకలం: ఢిల్లీ కేంద్రంగా - కీలక ఆధారాల లభ్యం..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సోదాలు ముమ్మరమయ్యాయి. వందల కోట్ల లావాదేవీలు బయట పడుతున్నాయి. మద్యం వ్యాపారులతో పాటుగా స్థిరాస్థి వ్యాపారులు - వారి రాజకీయ సంబంధాలపైన పలు ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కారం లో మూలాల పైన దిల్లీ మద్యం సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా అందిన సమాచారంతో ప్రముఖ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావును రెండు రోజులుగా సుదీర్ఘంగా విచారించారు. ఈడీ అధికారులు హైదరాబాద్‌లో వరుసగా సోదాలు నిర్వహించడమే కాకుండా ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసారు.

విచారణలో వెలుగులోకి కొత్త పేర్లు

విచారణలో వెలుగులోకి కొత్త పేర్లు

తాజాగా వెన్నమనేని శ్రీనివాసరావు,పెన్నాక శరత్‌ చంద్రారెడ్డి సహా మరికొంత మందిని అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోందని తెలుస్తోంది. రెండురోజుల క్రితం ఉప్పల్, మాదాపూర్ లోని రెండు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో సోదాలు నిర్వహించిన అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దిల్లీలోని మద్యం కుంభకోణంతో ఈ సాఫ్ట్​వేర్ కంపెనీలకు సంబంధం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్​కు చెందిన శ్రీనివాసరావు ఇసుక, మైనింగ్, స్థిరాస్తి వ్యాపారంతో పాటు పలు కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావు మొబైల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీ కేంద్రంగా ఈడీ విచారణ

ఢిల్లీ కేంద్రంగా ఈడీ విచారణ

అవసరమైతే దిల్లీకి రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు శ్రీనివాస్‌రావుకు తెలిపారు. ఈడీ అధికారులు సెల్‌ఫోన్‌ను రామాంతపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించి విశ్లేషించే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌లో గ్రౌండ్‌ వర్క్‌ పూర్తి కావడంతో ఇకపై ఈ కేసు పూర్తిస్థాయి విచారణ ఢిల్లీ కార్యాలయంలోనే కొనసాగించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ కేసులో తదుపరి నోటీసుల జారీ ప్రక్రియ మొత్తం ఢిల్లీ నుంచే జరుగనుంది. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి హవాలా మార్గంలో డబ్బులు దిల్లీకి తరలించినట్లు అనుమానిస్తున్నారు. కరీంనగర్​కు చెందిన శ్రీనివాసరావు ఇసుక, మైనింగ్, స్థిరాస్తి వ్యాపారంతో పాటు పలు కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా ఉన్నట్లు గుర్తించారు.

కీలక ఆధారాలు లభ్యం.. రాజకీయ కలకలం

కీలక ఆధారాలు లభ్యం.. రాజకీయ కలకలం

హైదరాబాద్‌లో 3 దఫాలుగా నిర్వహించిన తనిఖీల్లో ఢిల్లీ ఈడీ ప్రత్యేక బృందాలు కీలక డిజిటల్‌ ఆధారాలు స్వాధీనం చేసుకున్నాయి. హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లతోపాటు మరికొన్ని డిజిటల్‌ ఆధారాల్ని విశ్లేషించేందుకు సాంకేతిక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఇక, ఈ దాడుల సమయంలో సేకరించిన సమాచారంతో రాజకీయ ప్రముఖుల సహాయ సహకరాల పైన ఈడీ ఫోకస్ చేసింది. దీంతో..ఇప్పుడు ఈడీ సోదాలు - విచారణ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠతకు కారణమవుతోంది.

English summary
The ED investigating many crucial persons who linked with Delhi liquor scam in Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X