Telangana: గురుకులాలు, వసతి గృహాల్లో విద్యా కమిషన్ పర్యటన..
తెలంగాణలోని గురుకులాలు, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతోన్నాయి. దీంతో ప్రభుత్వం దీనిపై సీరియస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి గురుకులాలు, వసతి గృహాల్లో పర్యటించాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. మరోవైపు విద్యా కమిషన్ రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తుంది. విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో గురువారం నుంచి పర్యటన చేస్తున్నారు. కమిటీలో ప్రొఫెసర్ విశ్వేశ్వర్, వెంకటేశ్, జ్యోత్స్న ఉన్నారు. వీరంతా గురుకులాలు, వసతి గృహాల్లో పర్యటిస్తున్నారు.
గురువారం హైదరాబాద్, వికారాబాద్‌లలో కమిషన్ పర్యటించింది. గురుకులాలు, వసతి గృహాల్లో వడ్డించే అన్నం, కర్రీలను పరిశీలించారు. అలాగే కూరగాయలు, వంట సరకులను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యా కమిషన్ డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో పర్యటించనుంది.
విద్యా కమిషన్ పర్యటనలకు సహకరిస్తూ, అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా కమిషన్ శుక్రవారం
నాగర్ కర్నూల్, సిద్దిపేట, వరంగల్, మహబూబ్ నగర్ లలో కమిషన్ పర్యటించనుంది.

నవంబర్ 30న రంగారెడ్డి, హన్మకొండ, నల్గొండ, డిసెంబర్ 1న సిరిసిల్ల, మేడ్చల్, భూపాలపల్లి, సూర్యాపేట ,2న ఖమ్మం, భువనగిరి, జనగామ, గద్వాల్, డిసెంబర్ 3న కొత్తగూడెం, మెదక్, ములుగు, వనపర్తి జిల్లాల్లో.. కమిషన్ పర్యటించనుంది. డిసెంబర్ 4న కామారెడ్డి, కరీంనగర్, నారాయణ్ పేట్ , 5న ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, 6న నిర్మల్, ఆసిఫాబాద్, డిసెంబర్ 7న మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో విద్యా కమిషన్ పర్యటించనుంది. ఈ పర్యటనలకు సంబంధించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశం ఉంది.
ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనల వెనక బీఆర్ఎస్ కుట్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనల వెనక ప్రభుత్వ అధికారులు ఉంటే వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications