Medaram: మేడారం వెళ్తున్నారా.. అయితే ఆధార్ తప్పనిసరి..!
ఆసియాలో అతి పెద్ద గిరిజన జాతరగా సమ్మక్క-సారక్క జాతరకు పేరుంది. రెండ్లేకొసారి జరిగే ఈ జాతరకు భారీగా భక్తులు వస్తుంటారు. ఈసారి కూడా సమ్మక్క-సారక్క జాతరకు భారీగా భక్తులు రానున్నారు. ఈసారి సమ్మక్క-సారక్క జాతరను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించంది. వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించింది. మేడారంలో ఏర్పాట్లను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు.
అయితే మేడారం సమ్మక్క,సారక్క జాతర అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారం(బెల్లం). మేడారం వెళ్లి దాదాపు అందరు అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పిస్తారు. ఇక్కడ మనం ఎంత బరువు ఉంటామో.. అంత బరువు బంగారం(బెల్లం) వన దేవతాలకు సమర్పిస్తారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. మేడారంలో బెల్లం కొనుగోలు చేసిన భక్తుల వివరాలు ఇవ్వాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ఎత్తు బంగారం కొనుగోలు చేయాలనుకున్న భక్తులు వారి ఆధార్ జిరాక్స్, ఫోన్ నంబర్ ఇచ్చి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బెల్లన్ని బయట అమ్ముకుని సారా తయారీకి ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే ఎక్సైజ్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతర కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రోడ్లు వేయిస్తోంది. తాగు నీరు సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. మేడారం జాతర కోసం ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడపనుంది.
మేడారం జాతరకు కోటిన్నర భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మేడారం విద్యుత్ సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీఎస్ ఎన్పీడీసీఎల్) మేడారం విద్యుత్ ఏర్పాటు చేస్తోంది. సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, కరెంట్ పోల్స్ ఏర్పాటు చేస్తోంది. ఒక్క క్షణం కూడా కరెంట్ పోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications