Engineering Fees: తేలని ఇంజినీరింగ్ ఫీజుల వ్యవహారం.. బీకేటగిరీ సీట్లకు నోటిఫికేషన్..
ఇంజినీరింగ్ ఫీజులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్ చేపట్టింది. సీట్లు కూడా కేటాయించింది. అయితే ఫీజులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఫీజులు పెంచాలని కాలేజీ యాజమాన్యాలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి.

ఫీ రెగ్యులేటరీ కమిటీ
ఫీజుల విషయమై వరుస సమావేశాలు నిర్వహిస్తోన్న ఫీ రెగ్యులేటరీ కమిటీ ఎటూ తేల్చకుండా నాన్చుతోంది. తాజాగా జరిగిన సమావేశంలో ఫీజులపై నిర్ణయాన్ని వెల్లడిస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ఫీ రెగ్యులేటరీ కమిటీ చెప్పిన ఫీజులను కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకోకపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసిపోయింది.

మొదటి దశ కౌన్సెలింగ్
ఇదివరకు ఫీ రెగ్యులేటరీ కమిటీ సూచించిన ఫీజులను మూడేళ్ల పాటు అమలు చేశామని, మరో మూడేళ్ల కోసం కొత్త ఫీజులను నిర్ధారించాలని కాలేజీలు కమిటీని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైందని, ఇంజనీరింగ్ మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తయిందని, కాబట్టి ఫీజుల వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఫీజులను పెంచితే
అయితే ఫీజుల నిర్ధారణ సమయంలో పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకోవాల్సి అవసరం ఉందన్నారు. కాలేజీలు డిమాండ్ చేసినంత మేర ఫీజులను పెంచితే విద్యార్థులు... వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన సమావేశంలో కాలేజీల గ్రేడులను పరిగణనలోకి తీసుకుని ఫీజుల వివరాలను అధికారులు ప్రకటించారు.

అక్టోబరు 11 నుంచి
కానీ ఈ ఫీజులకు కాలేజీలు అంగీకరించలేదు. తక్కువ ఫీజులను తాము ఒప్పుకొనేది లేదని దాదాపు 20 కాలేజీల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. దీంతో ఫీజుల వ్యవహారం ఎటూ తేలకుండాపోయింది. ఫీజుల వ్యవహరం ఎటూ తేలకపోవడంతో రెండో విడత ఈ కౌన్సెలింగ్ అక్టోబరు 11 నుంచి ప్రారంభం ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

బి-కేటగిరీ సీట్లు
ఇది ఇలా ఉంటే కన్వీర్ కోటా సీట్లు భర్తీ పూర్తికాకముందే ఉన్నత విద్యామండలి బి-కేటగిరీ సీట్ల భర్తీకి అనుమతి ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీట్లు అమ్ముకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications