వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Nizam college: దిగొచ్చిన ప్రభుత్వం.. యూజీ విద్యార్థినులకే హాస్టల్ వసతి..

|
Google Oneindia TeluguNews

తమకు హాస్టల్ వసతి కల్పించాలని నిజాం కాలేజీ విద్యార్థులు గత 15 రోజులుగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చింది. కొత్తగా నిర్మించిన హాస్టల్ పూర్తిగా యూజీ విద్యార్థులకే కేటాయిస్తామని పేర్కొంది. ఈ మేరకు నిజాం ప్రిన్సిపాల్ ప్రకటన చేశారు.
హాస్టల్ వసతి కోసం యూజీ సెకండ్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలి సూచించారు. అంతకుముందు నిజాం కళాశాల హాస్టల్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించాడు.

మార్చిలో హాస్టల్‌ను ప్రారంభించినా.. డిగ్రీ విద్యార్థులను హాస్టల్‌లో చేర్చుకునేందుకు కాలేజీ యాజమాన్యం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ విద్యార్థులు ప్రశ్నించారు. కళాశాల హాస్టళ్లలో వసతి అవసరమైన సుమారు 500 మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లోనే తమకు వసతి కల్పించాలని కళాశాల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అస్సలు పట్టించుకోలేదని చెప్పారు. అయితే ప్రిన్సిపల్ ప్రకటనతో విద్యార్థులు ఆనంద వ్యక్తం చేశారు.

The government has said that only UG students will be provided hostel accommodation due to the concern of Nizhyan College students

దాదాపు 15 రోజులుగా వారు కాలేజీ ఆవరణలో బైఠాయించి నిరసనలు తెలిపారు. దీంతో ప్రభుత్వం హాస్టల్ లో 50 శాతం యూజీ, 50 శాతం పీజీ విద్యార్థులకు కేటాయించాలని నిర్ణయించింది. దీనిపై విద్యార్థినులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనను కొనసాగించారు. విద్యార్థుల ఆందోళను ప్రజా సంఘాలు, రాజయకీ పక్షాల నుంచి మద్దతు రావడంతో విద్యాశాఖ మంత్రి కాలేజీ ప్రిన్సిపల్ తో మాట్లాడి సమస్య పరిష్కరించారు.

English summary
The principal of Nizam College announced that the newly constructed hostel will be entirely reserved for UG students. An announcement was made to this effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X