Water: రాష్ట్రంలో అడుగంటిన భూగర్భ జలాలు...

రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగట్టాయి. దీంతో నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. యాసంగి పంటలు ఎద్దడి మొదలైంది. ఎండలు ముదురుతుండంతో పంటలకు చాలినంత నీరు అందట్లేదు. ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చెవుల్లోకి నీటిని వదిలితే నీటి కష్టాలు తప్పే అవకాశం ఉంది. అయితే యాసంగి వరి ఎక్కువగా వెయ్యొద్దని వ్యవసాయ అధికారులు సూచించినప్పటికీ చాలా మంది వరి సాగు చేశారు. దీంతో వారికి నీటి కష్టాలు మొదలయ్యాయి. జనవరిలోనే ఇలా ఉంటే.. మార్చి నాటికి నీటి ఎద్దడి పెరిగే అవకాశం ఉంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి జూరాల, బీమా లిఫ్ట్ లో ఆయకట్టుకు మరో తడి అందిస్తే వేరుశనగ, మొక్కజొన్న, పెసర, మినుము పంటలు బయటపడే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అయితే ఈ పంటలకు సైతం నీళ్లివ్వలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల వీపనగండ్ల, చిన్నంబావి, పానగల్ మండలాల రైతులు మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి తమ కష్టాలని వివరించారు.

The ground water level has decreased in the state

మరో తడి అందించాలని ఇరిగేషన్ ఎస్ఈని మంత్రి ఆదేశించారు. అయితే వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలకు నీటిని నిల్వ చేయడంతో ఆ నీటిని కాలువలకు వదిలేందుకు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది ఇప్పటికీ వరి సాగు చేస్తున్నారు. వారు వరి మానుకుని ఆరుతడి పెంటలు వేసుకుంటే మంచిదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

భూగర్భ జలాలు అడుగంటడంతో బావులు ఎండిపోతుండగా, బోర్లలో నీళ్లు అడుగట్టాయి. జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబావి, పానగల్ మండలాల్లో 10 వేల ఎకరాల్లో వేరుశనగ, గోపాల్ పేట, రేవల్లి, శ్రీరంగాపురం, పెబ్బేరు మండలాల్లో 15 వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారు. జూరాల, శ్రీశైలం రిజర్వాయర్లలో నీళ్లు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతోందని ఇరిగేషన్​ ఆఫీసర్లు వివరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+