High Court: షర్మిలను ఎందుకు అడ్డుకుంటున్నారు.. పోలీసులకు హైకోర్టు సూటి ప్రశ్న..!
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. షర్మిల ఇంటిముందు పోలీసులు ఎందుకు మొహరించారని నిలదీసింది. తమకు పోలీసులు అడ్డు తుగులుతున్నారని షర్మిల లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పలు ఆదేశాలు జారీ చేసింది. షర్మిల ఇంటి ముందు బారికేడ్లను తొలగించాలని స్పష్టం చేసింది.

బహిరంగ సభ
అదే సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బహిరంగ సభలు నిర్వహించొద్దని షర్మిలకు స్పష్టం చేసింది. షర్మిల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మంగళవారం షర్మిలను కోర్టుకు రాకుండా అడ్డుకున్నారని అన్నారు. పోలీసులు ఆమెను ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా బయటకు రానివ్వలేదన్నారు.

శాంతి భద్రతల సమస్య
షర్మిల వల్ల తరుచూ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వపు తరఫు న్యాయవాది వాదించారు. షర్మిల బెయిల్ షరతులను ఉల్లంఘించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎస్ఆర్ నగర్, అంబేద్కర్ విగ్రహం వద్ద ఘటనలే ఇందుకు నిదర్శమన్నారు.

పోలీసులపై కేసు
అంతకు ముందు తన హక్కులను ఉల్లంఘిస్తున్న పోలీసులపై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు షర్మిల తెలిపారు. తాను పాదయాత్ర చేస్తే అడుగడునా పోలీసులతో అడ్డుకుంటున్నారని.. వాహనాన్ని దగ్దం చేశారని విమర్శించారు. మహిళ అయి ఉండి ఎమ్మెల్సీ కవిత లిక్కర్ మాఫియాతో కోట్లు సంపాదించారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications