సర్కార్ కు హైకోర్టు షాక్ - లగచర్ల నోటిఫికేషన్ రద్దు..!!

తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లగచర్ల.. హకీంపేట భూసేకరణ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ భూసేకరణ పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయింది. భూసేకరణ కోసం లగచర్ల సమీపంలో కలెక్టర్ తో పాటుగా అధికారుల పైన దాడి జరిగింది. రాజకీయంగానూ పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఫార్మా సిటీ కోసం భూ సేకరణ రద్దు చేసిన ప్రభుత్వం మల్టీ పర్పస్ పారిశ్రామిక పార్క్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా కోర్టు ఆదేశాలో ప్రభుత్వం తదుపరి అడుగులు ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.

తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వాన్నికి ఎదురుదెబ్బ తగిలింది. లగచర్ల, హకీంపేట భూ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రేవంత్ సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ పరిధిలోని లగచర్ల, హకీంపేటలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి భూసేకరణ కోసం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది నవంబర్ 11న ఫార్మా కంపెనీల ఏర్పాటు సంబంధించి భూసేకరణ కోసం లగచర్ల సమీపంలో కలెక్టర్, ఇతర అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలోకి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై ఒక్కసారిగా కొందరు దాడులకు దిగారు. ఈ ఘటన పెద్ద దుమారానికి కారణమైంది.

The High Court has quashed the land acquisition notification in lagacahrla

కాగా, ఈ ఘటనకు సంబంధించి కుట్ర చేశారన్న అభియోగాలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు, రైతులు కూడా అరెస్ట్ అ యారు. ఫార్మాసిటీని రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ భూసేకరణ నోటిఫికేషన్ ను ప్రభు వం రద్దు చేసింది. నవంబర్ 30న అదే ప్రాంతంలో మల్టీ పర్పస్ పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు నోటిఫి షన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన భూసేకరణను ప్రారంభించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వీని పైన విచారణ నిర్వహించిన హైకోర్టు భూ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం వెలువరించింది. ఇక, ఇప్పుడు ప్రభుత్వం ఈ తాజా ఆదేశాల పైన తదుపరి చర్యలు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+