CAT: ఏపీకి వెళ్లాల్సిందే.. ఐఏఎస్ లకు షాకిచ్చిన క్యాట్..!
ఏపీ రాష్ట్ర పునర్విభజన ప్రకారం ఏపీకి కేటాయించిన ఐఏఎస్ లు ఏపీకి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు ఐఏఎస్ లు క్యాట్ ను ఆశ్రయించారు. మంగళవారం దీనిపై క్యాట్ విచారణ చేపట్టింది. చివరికి ఈ ఐఏఎస్ లకు క్యాట్ షాకిచ్చింది. డీవోపీటీ ప్రకారం ఎక్కడి వారు అక్కడే రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది. బుధవారం యథావిధిగా రిపోర్ట్ చేయాలని క్యాట్ తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా క్యాట్ ఐఏఎస్ లపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారని.. వారికి సేవ చేయాలని మీకు లేదా అని ప్రశ్నించింది.
ఐఏఎస్‌ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయని క్యాట్ స్పష్టం చేసింది. స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్ చేసుకునే అవకాశం గైడ్‌లైన్స్‌లో ఉందా అని ఐఏఎస్ ల తరఫు న్యాయవాదిని అడిగింది. వన్ మ్యాన్ కమిటీ సిఫారసులను డీవోపీటీ పట్టించుకోవడం లేదని ఐఏఎస్ అధికారుల తరఫు న్యాయవాది వాదించారు. సింగిల్‌మెన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే ముందు కమిటీ నివేదికను ఇవ్వలేదని.. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

దీంతో తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ కు చెందిన అధికారులు బుధవారం ఏపీ సీఎస్ వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంది. దీనిపై ఐఏఎస్ ఏం చేస్తారో చూడాలి. ఏపీ కేడర్ కు చెందిన 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ లు తెలంగాణలో కొనసాగుతోన్నారు. ఈ 11 మందిలో జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, రోనాల్డ్ రాస్ తో పాటు పలువురు ఐఏఎస్ లు ఉన్నారు. అయితే ఈ 11 మంది ఐఏఎస్ లు ఇక్కడే పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
11 మందిలో కీలక విభాగాల్లో పని చేస్తున్నారని.. వీరిని వెంటనే రిలీవ్ చేయడం వల్ల పాలనకు సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే క్యాట్ నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ కు చెందిన అనంతరాము, ఎస్ఎస్ రావత్, హరికిరణ్, సృజన, శివశంకర్ ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది.












Click it and Unblock the Notifications