Viral Video: దేవుడున్నాడు.. హుండీలో ఇరుక్కుపోయిన దొంగ చేయి..

దొంగతనం చేసే వారికి అది బడా.. గుడా అని సంబంధం లేదు. చేతివాటం చూపడమే వారి లక్ష్యం. వారికి డబ్బులు, బంగారం కనిపిస్తే చాలు చోర కళ బయట పడుతోంది. అయితే ఓ దొంగ దేవుడి హుండీకే కన్నం వేయ్యాలని చూశాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా.. దొంగ పని పట్టాడు. దొంగ డబ్బుల కోసం హుండీలో చేయి పెట్టాడు. అయితే దొంగ చేయి హుండీ ఇరుక్కుపోయింది. ఏం చేసినా చేయి బయటకు రాలేదు.

చివరికి గ్రామస్థులు వచ్చి అతని హుండీ అతని చెయి బయటకు తీశారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలో జరిగింది. దొంగ చెయి హుండీలో ఇరుక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిక్నూర్ రామేశ్వరపల్లిలోని మాసుపల్లి పోచమ్మ ఆలయంలో సురేశ్ అనే వ్యక్తి పని చేస్తాడు. అతను మంగళవారం రాత్రి హుండీలో డబ్బుల దొంగతనానికి ప్రయత్నించాడు.

The incident of thief s hand getting stuck in hundi

భక్తులు సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్దామని హుండీలో చేయి పెట్టాడు. చెయి హుండీలోనే ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నం చేసినా చెయి బయటకు రాలేదు. చేసేదేమి లేక ఉదయం వరకు గుడిలోనే ఉన్నాడు. గుడికి వచ్చిన భక్తులు స్థానికులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడి వచ్చారు. సురేష్ చెయిని హుండీ నుంచి బయటకు తీశారు. సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజంగానే దేవుడున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. దేవుడి మహిమతోనే సురేశ్ చెయి హుండీలో ఇరుక్కుపోయిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+