నిప్పూ ఉప్పు: కేసీఆర్, పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుకున్నారంటే...
హైదరాబాద్: రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో ఆదివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపు ముచ్చటించుకున్నారు.
చదవండి: రాజ్‌భవన్లో కేసీఆర్-పవన్ కళ్యాణ్ ఏకాంత చర్చ: బాబుతో ఆత్మీయంగా, సీఎంలతో చిరంజీవి ఇలా (ఫోటోలు)
గతంలో నిప్పు ఉప్పు మాదిరిగా పరస్పరం చిటపటలాడే వారిద్దరు ఏం మాట్లాడుకున్నారనే విషయంపై విస్తృత చర్చ సాగుతోంది. అయితే ఆయన మాట్లాడుకున్న విషయాలంటూ మీడియాలో ఓ వార్తాకథనం వచ్చింది.

ఈ విషయాలే మాట్లాడుకున్నారు....
పవన్ కల్యాణ్, కేసీఆర్ కలిసి దేశ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్లు తెలిసిందంటూ ఓప్రముఖ మీడియా సంస్థ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోందంటూ రాసింది. వారిద్దరు తీరిగ్గా పరస్పరం మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచిన మాట నిజమే. వారేం మాట్లాడుకున్నారనే విషయంపై ఆసక్తి ఉండడం కూడా సహజమే.

గవర్నర్‌తో ప్రత్యేకంగా పవన్ కల్యాణ్
రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. వారిద్దరి మధ్య ఏం చర్చ సాగిందనేది కూడా ఆసక్తికరమైన విషయమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న పవన్ కల్యాణ్ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తారా, బిజెపికి సానుకూలత వ్యక్తంచేస్తారా అనే సందేహం ఉన్న ఈ స్థితిలో ఆ భేటీపై ఆసక్తి చెలరేగుతోంది.

వీరు విందులో ప్రధాన ఆకర్షణ
కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ విందులో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ కొద్దసేపు మాట్లాడుకున్నారు. అయితే, కేసీఆర్‌తో మాత్రం పవన్ కల్యాణ్ చర్చ చాలా సీరియస్‌గా సాగిందని, వారిద్దరి మధ్య స్నేహం మొగ్గ తొడిగిందని అంటున్నారు.

చంద్రబాబుతో కెసీఆర్ ముచ్చట
ఇవాంక పర్యటనకు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి మాత్రమే కాకుండా ఇటీవలి ప్రపంచ తెలుగు మహాసభలకు కేసీఆర్ చంద్రబాబును ఆహ్వానించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబుకు, కేసీఆర్‌కు మధ్య అది దూరం పెంచుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. ఆ అనుమానాలకు తెర దించుతూ వారిద్దరు కలుపుగోలుగా మాట్లాడుకున్నారు.












Click it and Unblock the Notifications