ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరిక ఫిక్స్: తలక్రిందులైన కేసీఆర్ వ్యూహం; గుడ్ బై చెప్తారా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజా రాజకీయం గులాబీ బాస్ కేసీఆర్ కు తలనొప్పిగా మారుతోందా? కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయిన ప్రశాంత్ కిషోర్ టిఆర్ఎస్ కు ఎన్నికల వ్యూహకర్తగా ఎలా కొనసాగుతారు అన్న ప్రశ్న గులాబీ నేతల్లో చర్చనీయాంశంగా మారిందా? 2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని పావులు కదపాలని భావించిన గులాబీ బాస్ కు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనికొస్తాయి అనుకుంటే,ఊహించని విధంగా ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చారా? అంటే అవును అని చెప్పక తప్పదు.

పీకే విషయంలో సందిగ్ధంలో గులాబీ బాస్ కేసీఆర్

పీకే విషయంలో సందిగ్ధంలో గులాబీ బాస్ కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేస్తున్నట్లు కేవలం నెల రోజుల క్రితమే వెల్లడించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడానికి ఆయన చేసిన ప్రణాళికలు టిఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ లెక్కలను తలకిందులు చేసినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరియు రాహుల్ మరియు ప్రియాంక గాంధీలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇక ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగించాలా? వద్దా అన్న సందిగ్ధంలో గులాబీ బాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

పీకేతో కలిసి పని చేస్తామని చెప్పిన నెలలోపే కేసీఆర్ కు షాక్

పీకేతో కలిసి పని చేస్తామని చెప్పిన నెలలోపే కేసీఆర్ కు షాక్

దేశంలో మార్పు తీసుకురావడానికి పీకేతో కలిసి పనిచేస్తున్నట్లు మార్చి 21న కేసీఆర్ వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ నాతో పని చేస్తున్నాడు. ఇందులో తప్పేముంది? మీరు అతనిని చూసి ఎందుకు భయపడుతున్నారు అని కొందరు బీజేపీ నేతల విమర్శలను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. గత 7-8 ఏళ్లుగా పీకే తన బెస్ట్ ఫ్రెండ్ అని అభివర్ణించిన కేసీఆర్.. తన పని కోసం ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ ఎవరో మీకు తెలియదు. దేశం పట్ల ఆయనకున్న నిబద్ధత ఏమిటి? అనేది మీకు తెలియదు. ఒక మంచి వ్యక్తిని కించపరుస్తున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను అని సీఎం కేసీఆర్ ఓ రేంజ్ లో ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్లో చేరితే ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేయడం మంచిది కాదని భావిస్తున్న కేసీఆర్

కాంగ్రెస్లో చేరితే ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేయడం మంచిది కాదని భావిస్తున్న కేసీఆర్

అయితే ఇటీవలి కాంగ్రెస్ లో చేరాలని పీకే చేస్తున్న ప్రయత్నాలు, తాజా పరిణామాలు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్‌ ప్రధాన ప్రత్యర్థిగా ఉండడంతో కేసీఆర్, టీఆర్‌ఎస్‌లను డైలమాలో పడేశాయి. 2019 ఎన్నికలకు ముందు ప్రాంతీయ పార్టీల ఉమ్మడి వేదికపై ఆలోచన చేస్తున్నప్పుడు, టీఆర్ఎస్ కాంగ్రెస్ మరియు బీజేపీ రెండింటికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రశాంత్ కిషోర్ తో కలిసి పని చేయడం మంచిది కాదు అన్న భావనను గులాబీ బాస్ వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త కాంగ్రెస్‌లో చేరితే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, పీకే కలిసి పనిచేసే అవకాశాలను వాస్తవంగా తోసిపుచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

పీకే కాంగ్రెస్ లో చేరితే ఆయనకు గుడ్ బై చెప్పే ఆలోచనలో కేసీఆర్

పీకే కాంగ్రెస్ లో చేరితే ఆయనకు గుడ్ బై చెప్పే ఆలోచనలో కేసీఆర్

ప్రశాంత్ కిషోర్ లోక్‌సభ ఎన్నికల ప్రణాళికతో మాత్రమే కాంగ్రెస్‌కు సహాయం చేయాలని నిర్ణయించుకుంటే, అతను ఇప్పటికీ తెలంగాణలో కేసీఆర్ కోసం పని చేయవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ విషయంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ మీద కేసీఆర్ కు వ్యతిరేకత లేనప్పటికీ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కోసం పని చేస్తే టిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటే అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన సేవలు అవసరం లేదని చెప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పొత్తు కష్టమే.. పీకేతో కలిసి పని చెయ్యటం నష్టమే!

కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పొత్తు కష్టమే.. పీకేతో కలిసి పని చెయ్యటం నష్టమే!

ఇక తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందా అంటే అంత అవసరం గులాబీ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికలలో, ఉప ఎన్నికలలో కూడా డిపాజిట్లు కోల్పోయింది. అలాంటి పార్టీతో పొత్తు కెసీఆర్ కు ఎలాంటి లాభాన్ని చేకూర్చదు. అలా కాకుండా పీకే కెసీఆర్ కోసం పని చేస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనని బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఊతం ఇచ్చినట్లు అవుతుంది. ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే టిఆర్ఎస్ పార్టీ కోసం ఆయన సేవలు తీసుకోవద్దని గులాబీ నేతలు భావిస్తున్నారట. ఇప్పుడు పీకే వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లోనే కాదు, టిఆర్ఎస్ పార్టీ లోనూ ఆసక్తికర చర్చకు కారణం గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+