TGSRTC: ఆర్టీసీ ఛార్జీలు పెంచారా.. క్లారిటీ ఇచ్చిన సజ్జనార్..!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టికెట్ ధరలు పెంచినట్లు వస్తున్న వార్తలపై స్పందించింది. బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో టీజీఎస్ఆర్టీసీ విప‌రీతంగా టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి వాస్త‌వం లేదని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. జీవో ప్ర‌కారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించిందన పేర్కొన్నారు. రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు. ప్ర‌ధాన పండుగులైన సంక్రాంతి, ద‌స‌రా, రాఖీ పౌర్ణ‌మి, వినాయ‌క చ‌వితి, ఉగాది సందర్భంలో హైదరాబాద్ నుంచి భారీగా ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు.

వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఉండేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ క్రమంలో సిటీ బస్సులను జిల్లాలకు పంపుతుంది. వెళ్లేటప్పుడు ఫూల్ గా వెళ్లిన బస్సులు వచ్చేటప్పుడు ఖాళాగా వస్తాయి. అందుకే ప్రత్యేక బస్సుల కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలు సవరించుకోవచ్చని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిందని పేర్కొన్నారు. పండుగ‌ల స‌మ‌యాల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే 1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చిందని వివరించారు.

The MD of the organization said that there is no truth in the news that the RTC charges have been increased

ఉదాహరణకు పండగల సమయంలో జేబీఎస్ నుంచి కరీంనగర్ కు వెళ్లే ప్రయాణికులు భారీగా ఉంటారు. వీరి కోసం ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడుపుతుంది. కరీంనగర్ వెళ్లేటప్పుడు బస్ పూర్తిగా నిండి వెళ్తోంది. కాని తిరిగి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఎవరు ఎక్కడం లేదు. తిరిగి వచ్చే సమయంలో డీజిల్ ఖర్చుల కోసం టికెట్ ధరలు పెంచారు. ఇది కేవలం ప్రత్యేక బస్సులకు మాత్రమే. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు త‌ర్వాత ఆర్టీసీ బ‌స్సుల్లో 25 శాతం మేర ర‌ద్దీ పెరిగిందిని ఆర్టీసీ పేర్కొంది. గతంతో పోల్చితే సంక్రాంతి, రాఖీ పౌర్ణ‌మి, త‌దిత‌ర పండుగ‌ల‌కు బ‌స్సుల్లో ప్ర‌యాణాలు పెరిగాయని గుర్తు చేసింది.

ఆయా సమయాల్లో ఒకవైపే రద్దీ ఎక్కువగా ఉంటోంది. తిరుగు ప్రయాణంలో బస్సులన్నీ ఖాళీగా వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయా పండుగుల్లో న‌డిచే స్పెష‌ల్ బ‌స్సుల‌కు చార్జీల‌ను జీవో ప్ర‌కారం స‌వ‌రించ‌డం జరుగుతోందని తెలిపింది. టీజీఎస్ఆర్టీసీలో ప్ర‌స్తుతం 9 వేల‌కు పైగా బ‌స్సులు సేవ‌లందిస్తున్నాయని.. పండుగ స‌మ‌యాల్లో ర‌ద్దీకి అనుగుణంగా ప్ర‌తి రోజు స‌గ‌టున 500 స్పెష‌ల్ బ‌స్సులను సంస్థ న‌డుపుతున్నట్లు పేర్కొంది. ఆ 500 స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల సవరణ చేసినట్ల... మిగ‌తా 8500 రెగ్యుల‌ర్ స‌ర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండ‌దని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+